20 ఏళ్ల జ్ఞాపకాలను కోల్పోయిన ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నదంటే..

జ్ఞాపకశక్తి కోల్పోవడం అనేదానిని మనం సినిమాల్లో లేదా టీవీ షోలలో చూసిఉంటాం.అయితే ఇది సినిమాల్లోనే కాదు నిజంగానే జరిగింది.

 British Woman Lost Her Memory Of 20 Years , British, Memory, Muffet, Encephaliti-TeluguStop.com

బ్రిటన్‌లో నివసిస్తున్న మఫెట్ అనే 43 ఏళ్ల మహిళ తన కథను చెప్పినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు.ఆమె తన జీవితానికి సంబంధించిన 20 ఏళ్ల జ్ఞాపకాలను మరచి పోయింది.

దీని తర్వాత ఆమె తన భర్తను, పిల్లలను గుర్తించలేదు.తొలుత ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరింది.

చికిత్స కోసం ఒక వారం పాటు వెంటిలేటర్‌లో ఉండవలసి వచ్చింది.ఆ తరువాత స్పృహలోకి వచ్చి జ్ఞాపకశక్తి కోల్పోయింది.

మఫెట్ తెలిపిన వివరాల ప్రకారం 2021 సంవత్సరంలో మెదడువాపు వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది.మూర్ఛ ఉండటంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది.

ఆమెను ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంచారు.

తాను గతం మరచిపోవడం గురించి ఆమె చెబుతూ తన జీవితానికి సంబంధించిన 20 ఏళ్ల జ్ఞాపకాలను మరచిపోయానని తెలిపింది.

తాను వారం రోజులకుపైగా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండాల్సి వచ్చిందని.వ్యాధి నుంచి కోలుకునే సరికి గతం మరచిపోయానని తెలిపింది.

న్యూరాలజిస్టులు ఆమను పరిశీలించి, మెదడువాపు కారణంగా మఫెట్ జ్ఞాపకశక్తి కోల్పోయిందని తెలిపారు.చాలా కాలం పాటు లైఫ్ సపోర్టులో ఉన్న తర్వాత మఫెట్ స్పృహలోకి వచ్చింది.

కానీ జ్ఞాపకశక్తి కోల్పోయింది.మఫెట్ ఎన్సెఫాలిటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది.

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి వచ్చినప్పుడు మెదడులో వాపు మొదలవుతుందని, దీని కారణంగా బాధితుడు ప్రతిదీ మరచిపోతాడు.దీనిని ‘బ్రెయిన్ ఫీవర్’ అని కూడా అంటారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube