ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్లుగా పనిచేస్తూ వెండితెరపై అవకాశాలను అందుకుని వెండితెరపై కూడా తమ సత్తా చాటుకుంటున్నారు టాలీవుడ్ యాంకర్స్.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది యాంకర్స్ వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సరిగమప కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న శ్రీముఖి కూడా కెరియర్ మొదట్లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.ఇలా వెండితెరపై పలు సినిమాలలో నటించిన ఈమె బుల్లితెర యాంకర్ గా కొనసాగారు.
ఇలా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ మరోసారి వెండితెరపై అవకాశాలను అందుకని దూసుకుపోతున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె యాంకర్ గా వ్యవహరిస్తున్న సరిగమప కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వలిమై చిత్రబృందం వచ్చారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నిర్మాత బోనీకపూర్ ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి ఏకంగా నిర్మాత బోనీకపూర్ ను మీ సినిమాలో ఏమైనా పాత్ర ఉంటే తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగారు.దీంతో బోనీకపూర్ ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు.నేను సౌత్ ఇండస్ట్రీ లో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు తప్పకుండా మీకు హీరోయిన్ అవకాశం ఇస్తానని చెప్పడంతో అక్కడున్న వారందరూ సరదాగా నవ్వుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.