నారా నందమూరి కుటుంబం మధ్య ' నాని ' చిచ్చు ?

తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకొనేది నందమూరి కుటుంబం గురించి.ముఖ్యంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గురించే చెప్పుకుంటారు.

 Ap Minister Perni Nani Sensational Comments On Chandrababu And Ntr Nara Chandrab-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఒక సంచలనమే.పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించారు.

ఆ తర్వాత క్రమంలో టిడిపి నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబం చేతుల్లోకి వచ్చింది.ప్రస్తుతం చంద్రబాబు టిడిపి అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆయన తర్వాత నారా లోకేష్ టిడిపి అధ్యక్షుడు అవుతారు.ఇందులో ఎటువంటి సందేహం లేదు.

టిడిపికి మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది.దీంతో ఆ సామాజిక వర్గంలో చీలిక తీసుకు వచ్చేందుకు ఏపీ అధికార పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

మంత్రి కొడాలి నాని ద్వారా, చంద్రబాబు లోకేష్ వంటి వారిని టార్గెట్ చేసుకుంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయిస్తున్నారు.ఇక తాజాగా మరో మంత్రి పేర్ని నాని చంద్రబాబు కుటుంబంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

      జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ను ప్రస్తావిస్తూ పేర్ని నాని చంద్రబాబు లోకేష్ వంటి వారిపై విమర్శలు చేశారు.పవన్ సినిమాను ప్రస్తావిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ట్వీట్ ను  ప్రస్తావిస్తూ నాని విమర్శలు చేశారు.

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నాను అంటూ లోకేష్ చేసిన ట్వీట్ పై పేర్ని నాని విమర్శలు చేశారు.మీ కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్  సినిమా గురించి ఎప్పుడైనా ఈ విధంగా ట్వీట్ చేశారా ? ఎన్టీఆర్ సినిమా గురించి తాము ఎదురు చూస్తున్నామని ఎప్పుడైనా అన్నారా అంటూ పేర్నినాని ప్రశ్నించారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగు దేశం కోసం చొక్కాలు చింపుకుని మరీ కస్టబడుతున్నారని, అయినా జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ను పొగుడుతున్నారు అంటూ పేర్ని నాని విమర్శలు చేశారు.   

  నాని ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.టిడిపికి పూర్తిగా మద్దతు పలుకుతూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆ పార్టీకి దూరం చేయాలని,  ఇదే విషయంపై నందమూరి కుటుంబంలోనూ చర్చ జరిగేలా చేస్తే ఆ సామాజిక వర్గంలోనూ తప్పకుండా చీలిక వస్తుంది అనే అంచనాలో వైసిపి ఉండడం తోనే నాని ద్వారా ఈ విమర్శలు చేయించినట్లు గా అర్ధం అవుతోంది.

Ap Minister Perni Nani Sensational Comments On Chandrababu And Ntr Nara Chandrababu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube