మంత్రిగారు అరెస్ట్ అవుతారా!!

అధికారంలో ఉన్న వారిని జైలుకు పంపడం అంటే చాలా కష్టమైన విషయం.ఏదైనా భారీ తప్పు చేస్తే తప్పా అలాంటి అవకాశం దొరకదు.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో కొలువు తీరిన మంత్రుల్లో ఒకరిపై పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీచేశారు.విషయం ఏమిటంటే గతంలో అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కారంచేడులో తెలుగుదేశం పార్టీ సభ్యురాలు నన్నపనేని రాజకుమారిపై దాడి జరిగింది.

అయితే దానికి నిరసనగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఒంగోల్ లో కలక్టరేట్ ఎదుట దర్నా నిర్వహించారు.ఇక దర్నాకు అనుమతి లేకపోవడం.

పోలీసులు తెలుగుదేశం నాయకులను ఆరెస్ట్ చేసి కేసులు పెట్టడం వంటివి షరా మామూలుగానే జరిగిపోయాయి.ఆ ధర్నా భాగంగా నన్నపనేని రాజకుమారి, కరణం బలరామమూర్తి, యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్, శిద్ధారాఘవరావులతో పాటు మొత్తం 60 మందిపై కేసులు పెట్టడం జరిగింది.

Advertisement

ఇక ఈ విషయంలో ఇప్పటికే రాజకుమారి కోర్ట్ నుంచి బెయిల్ తెచ్చుకోగా, మిగిలిన నేతలు ఈ కేసులను పెద్దగా పట్టించుకోలేదు.కోర్ట్ పంపిన సమన్లు సైతం అందుకొలేదు.

ఈ చర్యలన్నింటినీ సీరియస్ గా పరిగణించిన కోర్ట్ వారు ఏపీ రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావుపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.అయితే ఈ వారెంట్ ఏ నాయకునికో, నేతకో వెళితే సహజమే కానీ, మంత్రి గారు కదా దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు