రోడ్ల మరమ్మతుకు యాక్షన్ ప్లాన్.. విపక్షాల విమర్శలకు జగన్ చెక్..

జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో నెలకొన్న రోడ్ల దుస్థితిపై ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా జనసేన నేతలు, నాయకులు రోడ్ల దుస్థితిని వివరించేందుకుగాను ఫొటోలు ప్రదర్శించారు.

 Ys Jagan Sensational Decision Regarding Ap Roads, Ap Roads, Ys Jagan, Pawan Kal-TeluguStop.com

వెంటనే రోడ్లను నిర్మించాలని కోరుతూ డిమాండ్ చేశారు.ఏపీ సర్కారు వైఖరిని నిరసిస్తూ ఆందోళనల చేశారు.

కాగా, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే ప్లాన్ వేశారు.భారీగా ధ్వంసమైన రోడ్ల రూపురేఖలను మార్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.

తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏపీ రోడ్లపై సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రులతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే ఎప్పటి నుంచి రోడ్లు కన్‌స్ట్రక్ట్ చేయాలి? ఎప్పటికల్లా పూర్తి చేయాలి? అనే విషయమై కచ్చితమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

Telugu Ap Roads, Jagan, Janasena, Pawan Kalyan, Pawankalyan, Tdp Ap Problems, Ys

అయితే, ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం పట్టాక రోడ్ల నిర్మాణాలు షరూ చేయాలని అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.వచ్చే వర్షాకాలం నాటికి రోడ్ల మీద గుంతలు అనేవి అస్సలు లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.రోడ్ల మరమ్మతుకు సంబంధించి టెండర్లు పిలిచామని, ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే అక్కడ వెంటనే టెండర్లు పిలువాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అక్టోబర్‌లో వర్షాలు పూర్తయిన వెంటనే పనులు స్టార్ట్ చేయాలని సీఎం పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ టీడీపీపై విమర్శలు చేశారు.చంద్రబాబు ప్రభుత్వం రోడ్లను విస్మరించిందని పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్లందరూ క్షేత్రస్థాయిలో రోడ్ల పరిస్థితిపై రిపోర్ట్స్ తెప్పించుకోవాలని, మొత్తంగా రోడ్లు అద్దంలా మెరిసేలా చేయాలని సీఎం స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా విపక్షాల విమర్శలకు ఏపీ సీఎం జగన్ మాటలతో కాకుండా చేతలతోనే సమాధానమివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube