రెడినా తమ్ముళ్లు ... ? ' బాబు ' వస్తున్నాడు ! 

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు ఏళ్ల సమయం మాత్రమే ఉండడంతో, టీడీపీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యారు.ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి, టీడీపీకి ఆదరణ పెంచాలని, పార్టీ కార్యకర్తల్లోనూ జోష్ నింపాలని డిసైడ్ అయ్యారు.

 Tdp Chief Chandrababu Leaving For District Tour-TeluguStop.com

ఈ రెండేళ్లు పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ,  ప్రజా సమస్యలపై పోరాడుతూ వైసిపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, తద్వారా తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో మంచి గుర్తింపు సాధించాలని బాబు భావిస్తున్నారు.ఈ మేరకు జిల్లాలో పర్యటన చేసేందుకు బాబు సిద్ధమవుతున్నారు.

అసలు  బాబు జిల్లాల టూర్ లో ప్లాన్ ఎపుడో వేసుకున్నా,  కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో,  దానిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.ఇక ఈ జిల్లా పర్యటనలో వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు,  ఎన్నికల హామీలను అమలు చేయక పోవడం, కొన్ని కొన్ని హామీలు అమలు చేసినా, వాటిని నిలిపి వేయడం, ఇలా అనేక అంశాలపై టీడీపీ వైసీపీ  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పోరాటం చేయాలని బాబు ప్లాన్ చేశారు.

అందుకే ఈ జిల్లా టూర్ ల కంటే ముందుగానే పార్టీ జిల్లా అధ్యక్షులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్చార్జిలు లేక పోవడంతో వారి నియామకాలపైనా దృష్టిపెట్టారు.

జిల్లా పర్యటనలో ఈ నియామకాలను పూర్తి చేయాలని బాబు భావిస్తున్నారు.ఏది ఏమైనా తన జిల్లా టూర్ లతో పార్టీ నాయకుల్లో మరింత ఉత్సాహం పెంచవచ్చని,  వైసీపీ ప్రభుత్వం పై మొదట్లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు ప్రజల్లో లేదని, ప్రజల్లో ఏ విషయాలపై వైసీపీ ప్రభుత్వం పై అసంతృప్తి ఉందో వాటిని హైలెట్ చేసుకుంటూ తన పర్యటనను కొనసాగించేందుకు బాబు సిద్ధం అవుతున్నారట.దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube