అన్నింటినీ అతికించే ఫెవీక్విక్ దాని ట్యూబ్‌కు అది ఎందుకు అంటుకోదంటే..

వివిధ రకాల వస్తువులను అతికించడానికి జిగురు అవసరం.ఇప్పుడు జిగురు సహాయంతో, బొమ్మలు  మొదలు కొని కొన్ని వాహన భాగాలను సైతం అతికిస్తున్నారు.

 Why Does Fevikwik Does Not Get Sticked To Its Container, Fevikwik , Sticked ,-TeluguStop.com

చెక్క, మెటల్, ప్లాస్టిక్ లేదా ఏదైనా సరే ప్రతిదానిని అతికిస్తున్నారు.అయితే, అలాంటి వాటిని సాధారణ జిగురుతో అతికించలేం.

ఇందుకు సూపర్ గ్లూ అవసరమవుతుంది.ఇంతకీ సూపర్ గ్లూ అంటే ఏమిటో మీకు తెలుసా? సూపర్ గ్లూకి మరోపేరు ఫెవిక్విక్.ఇది ఏ వస్తువునైనా చిటికెలో అతికిస్తుంది.ఇప్పుడు పనితీరు గురించి తెలుసు కుందాం.చాలా మంది దేనినైనా అతికించేందుకు ఫెవీక్విక్ ను వినియోగిస్తున్నారు.అన్ని వస్తువులను చిటికెలో అంటించే ఫెవిక్విక్ దాని ట్యూబ్ కు అది ఎందుకు అంటుకోదో తెలుసా? దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేకపోతే ఇది నిజంగా ఆలోచించి అర్థం చేసుకోవలసిన విషయం అని గుర్తించండి.

ఫెవిక్విక్ దేనికైనా అంటుకుంటుంది కానీ దాని ట్యూబ్‌నకు అది అంటుకో దనేది నిజం.దీని వెనుక సైన్స్ ఉంది.ఫెవిక్విక్‌ను తయారు చేస్తున్నప్పుడు, కంపెనీ దాని సేంద్రీయ ద్రావకంలో చాలా ప్రత్యేకమైన పదార్థాన్ని జోడిస్తుంది.దీనిని సైనో అక్రిలేట్ పాలిమర్ అంటారు.

ఫెవిక్విక్ యొక్క ద్రావణాన్ని ఉపరితలంపై పడినప్పుడు.అది గాలితో ఆవిరైపోతుంది.

బయటి వస్తువువుకు అంటు కుంటుంది.అదే.ఫెవిక్విక్ దాని కంపార్ట్‌ మెంట్‌లో ఉన్నప్పుడు, అది గాలితో సంబంధంలోకి రాదు.ఫలితంగా అది ఆవిరైపోదు.

దాని ట్యూబ్ లో అంటుకోదు.అయితే దాని క్యాప్ తీసి కొద్దిసేపు ఉంచి అది ఖచ్చితంగా ట్యూబ్ లోపలే అంటుకు పోతుంది.

దీని ప్రకారం చూస్తే ఫెవిక్విక్ గాలిలోకి వచ్చే వరకు అంటుకోదని గమనించవచ్చు.

Why Fevikwik do not Stick to its container

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube