ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని వామ పక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.తాజాగా జరిగిన లెఫ్ట్ పార్టీల ఈ సదస్సులో పాల్గొన్న నాయకులు.
ఎవరికి వారు తమ అభిప్రాయాలు తెలియజేశారు.ఈ నెల 21వ తారీకు విశాఖకి ప్రధాని మోడీ వస్తారని అంటున్నారు.
ఆ సమయంలో విభజన హామీలు ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఇక ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కూడా హామీ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావు స్పష్టం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బడ్జెట్ లో పేదలకు అన్యాయం చేసి.కార్పోరేట్ కంపెనీలకు ఊడిగం చేశారు.
రైతులకు అందే నిధుల్లో కోత విధించారు.ఏపీకి తీవ్రంగా అన్యాయం చేశారు.
కరోనా కష్ట కాలంలో పేదలను వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు భారీగా నిధులు కేటాయించారు అంటూ కూడా వామపక్ష పార్టీల నేతలు బీజేపీ పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు.విభజన హామీలను నెరవేర్చకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు.