నేటి మ్యాచ్ లో రోహిత్ ఆ రికార్డ్ సాదించేనా..?!

నేడు భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.మొదటి వన్డేలో హాఫ్ సెంచరీతో రెచ్చిపోయిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పునరాగమన్నాని బాగానే చేశాడు.

 Rohit Break That Record In Today's Match Rohit Sharma, Latest News, Sports Upda-TeluguStop.com

ప్రస్తుతం మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా టీమిండియా మొదటి విజయం సాధించి 1 – 0 తో ఆధిక్యంలో ఉండగా నేడు విజేతను తెలిపే రెండో వన్డే జరగనుంది.ఇక అసలు విషయంలోకి వెళితే.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కు ఈ మ్యాచ్ లో భాగంగా 2 రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఈ రెండు రికార్డులు కూడా సిక్సర్ల రికార్డు అవడం విశేషం అని చెప్పాలి.

సిక్సర్ల ను అతి సులువుగా బాదే రోహిత్ శర్మ కు రికార్డు పెద్ద సంగతి కాదని చెప్పవచ్చు.ఈ మ్యాచ్ లో కేవలం ఒక్క సిక్సర్ కొడితే స్వదేశంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన వ్యక్తిగా రోహిత్ శర్మ అవతరిస్తాడు.

ఇదివరకు 113 ఇన్నింగ్స్ లో 116 సిక్సర్లు కొట్టి మహేంద్ర సింగ్ ధోనీ ఈ లిస్ట్లో ముందు ఉండగా.రోహిత్ శర్మ కి కేవలం 116 కొట్టడానికి 68 ఇన్నింగ్స్ లు సరిపోయాయి.

దీన్ని బట్టి చూస్తే రోహిత్ శర్మ బ్యాట్ కు ఎంత పని చెబుతున్నాడో ఇట్టే అర్థమవుతుంది.

Telugu Latest, Rohit Sharma-Latest News - Telugu

ఇక రోహిత్ శర్మ మరో సిక్సర్ల రికార్డ్ విషయానికొస్తే.అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో అలాగే విదేశాలలో మొదటి టీమిండియా ఆటగాడిగా ఉన్నాడు.కేవలం 5 సిక్సర్లు రోహిత్ శర్మ కొడితే మొత్తంగా 250 మార్కుకు చేరినట్లు అవుతుంది.

ఇకపోతే ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్లో షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉండగా.ఆ తర్వాత వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 331 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

అలాగే శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య 270 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube