శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు మరియు సినిమా సెలబ్రిటీలు పాల్గొనడం జరిగింది.ప్రపంచం లో కూర్చున్న విగ్రహాలలో రెండో అతిపెద్ద విగ్రహం గా సమతా మూర్తి విగ్రహం రికార్డు సృష్టించింది.
ప్రధాని మోడీ ఆవిష్కరించిన ఈ విగ్రహాన్ని సందర్శించడానికి చాలా మంది జనాలు వస్తున్నారు.శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ అదేవిధంగా ఏపీ సీఎం జగన్ మరియు ఇంకా వివిధ పార్టీల రాజకీయ నేతలు పాల్గొనడం జరిగింది.
అయితే తాజాగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
సంప్రదాయ పద్ధతులలో పంచకట్టు… తిరునామం తో అమిత్ షా వచ్చారు.చిన్న జీయర్ స్వామి అమిత్ షా కి ఘనస్వాగతం పలికారు.
ఈ సమయంలో చిన్న జీయర్ స్వామి ఆశ్రమం గురించి అనేక విషయాలు తెలియజేశారు.సమాజంలో మనుషులంతా ఒక్కటేనని శ్రీ రామానుజలు చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అమిత్ షా తన ప్రసంగంలో తెలిపారు.
మనుషులంతా ఒకటేనని సనాతన ధర్మం అన్నిటికీ మూలం అని పేర్కొన్నారు.