సాధారణంగా లెస్బియన్ మహిళలు గర్భం దాల్చడం సాధ్యం కాదు.ఎందుకంటే వాళ్లకి మగాళ్లతో రొమాన్స్ అంటేనే తేళ్లు జెర్రులు పాకినంత చిరాకు వస్తుంది.
అందువల్ల వారు మగాళ్లతో అసలు కలవరు.ఫలితంగా వారు మాతృత్వంలోని కమ్మదనాన్ని రుచి చూడలేరు.
కానీ ఒక లెస్బియన్ యువతి మాత్రం అందరికీ విభిన్నంగా నిలుస్తోంది.ఆమె సాధారణ మహిళలు లాగానే గర్భం దాలుస్తోంది.
దీంతో అందరూ అవాక్కవుతున్నారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన వింత విషయం ఏమిటంటే.
ఆమె ప్రతి నెలా గర్భవతిగా మారుతుంది.వినడానికి నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది అక్షర సత్యం.
కాకపోతే ఆమె నిజమైన శిశువును తన కడుపులో మోయడం లేదు.కానీ అచ్చం గర్భవతి లాగానే మారుతోంది.
అదెలాగో తెలుసుకొంటే .అమెరికాలో 22 ఏళ్ల సోఫ్ మోస్కా అనే ఒక లెస్బియన్ నివసిస్తోంది.ఈమెకు ఆడవాళ్లు తప్ప మగవాళ్లు అంటే అస్సలు ఇష్టం ఉండదు.ఎందుకంటే అదే ఆమె సెక్స్‌వల్ ఐడెంటిటీ.
అయినప్పటికీ సోఫ్ కు అందరి మహిళ లాగానే ప్రెగ్నెంట్ కావాలని.ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా తపన.ఈ కోరికను తీర్చుకునేందుకు ఆమె వినూత్నంగా ఆలోచించింది.ఆమె ఒక సిలికాన్ బేబీ బంప్ ను కొనుగోలు చేసింది.
ఈ బంప్ అనేది ఏడెనిమిది నెలల గర్భవతి ధరించిన గర్భంలా కనిపిస్తుంది.సిలికాన్ తో తయారు చేశారు కాబట్టి అచ్చం అది కడుపు లాగానే కనిపిస్తుంది.
ఎవరూ కూడా ఇది ఫేక్ ప్రెగ్నెన్సీ అని గుర్తించలేరంటే అతిశయోక్తి కాదు.అందుకే దీన్ని రూ.20 వేలు వెచ్చించి సొంతం చేసుకుంది సోఫ్ మోస్కా.అలా దీన్ని ప్రతి నెలా ధరిస్తూ చూడ్డానికి అచ్చం గర్భిణీ లాగానే మారుతోంది.
ఈ విధంగా ఆమె తన కోరికను తీర్చుకుంటోంది.అంతే కాదు ఈ ఫొటోలు, వీడియోను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్లో షేర్ చేస్తోంది.
అయితే పెట్టుడు గర్భం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఈమెకు దాదాపు రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
వీరంతా కూడా సోఫ్ ఒక గర్భవతి ఎలా అయిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆమె ఒక సిలికాన్ బేబీ బంప్ ద్వారా తాను గర్భవతిని అయ్యానని వీడియో రూపంలో తెలిపింది.
దాంతో ఆమె ఐడియాను నెటిజన్లు, ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.