టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ దుమ్ము రేపుతుంది.తెలుగు, తమిళ, కన్నడలో పలు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తుంది.
ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో చిన్నా చితక కలిసి 10 సినిమాల్లో నటిస్తుంది.అక్కడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇప్పటికే నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతుంది రకుల్.
అయితే సినీ సెలబ్రిటీలు ప్రేమలో ఉంటే సోషల్ మీడియాలో వారి గురించి ఏ చిన్న అప్ డేట్ ఉన్నా ఫోటోలు, వార్తలు వైరల్ అవుతాయి.
ఈ ముద్దుగుమ్మ మాత్రం సోషల్ మీడియాకు ఎక్కడం లేదు.అసలు ఇంతకీ వీరు ప్రేమలో ఉన్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది.తాజాగా తమ రిలేషన్ షిప్ గురించి ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.తామిద్దరం కలిసి డేటింగ్ కు వెళ్తాం.కానీ సోషల్ మీడియాలో హడావిడి చేయాలి అనుకోవడం లేదు.
మా పర్సనల్ జీవితాన్ని చాలా సాధారణంగా కొనసాగించాలి అనుకుంటున్నాం.ఈ విషయాలు బయటకు తెలియాలి అనకోవడం లేదు.ఇద్దరం కలిసి ఎక్కువగా జిమ్, ఫుడ్ గురించి మాట్లాడుకుంటాం.
తమ ప్రేమ విషయాలు పంచుకునే సమయం ఇంకా ముందే ఉంది అని వెల్లడించింది రకుల్.
వాస్తవానికి జాకీతో తనకు ప్రతి రోజు కొత్తగా ఉంటుందని వెల్లడించింది.
అతడి వెంట ఉన్నప్పుడు.నాకు నేనుగా అందంగా, నూతనంగా కనిపిస్తానని చెప్పింది.
అయితే రకుల్ ప్రేమ గురించి చెప్పమంటే సినిమా డైలాగులు చెప్తున్నావేంటి? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి అందరి మాదిరి తమ ప్రేమ కాదని చెప్తోంది.ప్రేమలందు మా ప్రేమ వేరు అని రకుల్ చెప్పకనే చెప్తోంది.మొత్తానికి వీరి ప్రేమ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో? అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.