మహిళల్లో మైగ్రేన్‌కు దారితీసే కారణాలివే.. నివారణకు ఏం చేయాలంటే..

మైగ్రేన్‌ అనేది ఈ రోజుల్లో యువతలో అత్యధికంగా కనిపిస్తున్న సమస్య.నేటి కాలంలో యువత వివిధ కారణాలతో మైగ్రేన్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.

 These Are The Causes That Lead To Migraine In Women Details, Migraine, Migraine-TeluguStop.com

మైగ్రేన్‌ సమస్య తలెత్తినప్పుడు తలలోని ఒక భాగంలో విపరీతమైన నొప్పి వస్తుంది.దీని కారణంగా రోగికి కళ్ళు తెరవడం కష్టం అవుతుంది.

మైగ్రేన్ ప్రభావం గుండెపై కూడా పడుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.మైగ్రేన్ నొప్పి కలిగినప్పుడు గుండె కూడా వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

మైగ్రేన్ నొప్పి 2 నుండి 72 గంటల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి.నేటి కాలంలో మైగ్రేన్ సమస్య మహిళలలో ఎక్కువగా కనిపిస్తోంది.

మైగ్రేన్ నొప్పి సమయంలో, రోగి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటాడు.తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వికారం, భయం, కాంతితో ఇబ్బందులు ఏర్పడతాయి.

కొన్ని రిపోర్టులలోని వివరాల ప్రకారం మైగ్రేన్‌తో బాధపడుతున్న స్త్రీలు గుండె సంబంధిత సమస్యలకు ఎక్కువగా గురవుతున్నారని తేలింది.

అలాగే వీరికి బ్రెయిన్ స్ట్రోక్, ఛాతీ నొప్పి వచ్చే ప్రమాదం అధికంగా ఉన్నదని తేలింది.

స్త్రీలకు మైగ్రేన్ రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి.మహిళల్లో మైగ్రేన్‌కు అనేక కారణాలు ఉండవచ్చు, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం, ధూమపానం, ఎక్కువ పెర్ఫ్యూమ్ ఉపయోగించడం, నిద్రలేమి, ఎక్కువ టెన్షన్ తీసుకోవడం, హార్మోన్లలో మార్పులు, వ్యాయామం చేయకపోవడం మొదలైనవి కూడా మైగ్రేన్‌కు కారణాలుగా మారుతున్నాయి.

Telugu Headache, Problems, Healthy, Junk Foods, Migraine, Pain, Periods-Telugu H

మహిళల్లో మైగ్రేన్‌ రావడానికి శరీరంలో ఈస్ట్రోజెన్‌ లోపమే ప్రధాన కారణం.పీరియడ్స్ సమయంలో, శరీరంలో హార్మోన్లలో మార్పులు జరుగుతాయి.ఈ కారణంగానూ మైగ్రేన్ వస్తుంది.ఇంతేకాదు పీరియడ్స్ ప్రారంభానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు కూడా మహిళలకు మైగ్రేన్ నొప్పి వస్తుంది.మెనోపాజ్‌తో బాధపడుతున్న మహిళలు మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారని అనేక గణాంకాలు చెబుతున్నాయి.మెనోపాజ్ తర్వాత, ఈస్ట్రోజెన్ హార్మోన్లు మహిళల్లో నియంత్రించబడవు.

దీని ఫలితంగా పార్శ్వపు నొప్పి వస్తుంది.తరచుగా మహిళలు అల్పాహారాన్ని దాటవేస్తారు.

అటువంటి పరిస్థితిలో మైగ్రేన్ వ్యాధి చుట్టుముడుతుంది.

Telugu Headache, Problems, Healthy, Junk Foods, Migraine, Pain, Periods-Telugu H

మహిళలు ప్రతి విషయంలోనూ ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు.దీని కారణంగా వారు మైగ్రేన్‌ బారినపడుతుంటారని వైద్యులు చెబుతున్నారు.మైగ్రేన్‌కు దూరంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకోవాలి.

జంక్ ఫుడ్స్, ఆయిల్ మసాలాలకు దూరంగా ఉండాలి.పెయిన్ కిల్లర్ తక్కువగా వినియోగించాలి.

ఆరోగ్యకరమైన, సమతుల ఆహారం తీసుకోవాలి.అధిక వెలుతురుకు దూరంగా ఉండటం ఉత్తమం.

రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవాలి.రెగ్యులర్ వర్కవుట్స్‌తో పాటు యోగా చేయాలి.

టెన్షన్‌కి దూరంగా ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube