ఎంత అయినా అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు.రోజులు ఎలా అయితే మారుతున్నాయో మనుషుల జీవన శైలి కూడా అలాగే మారుతూ వస్తుంది.
తినే తిండి విషయం దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు అన్ని చేంజ్ అయిపోయాయి. అలాగే పిల్లల్ని కనే విషయంలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి.
అప్పట్లో నార్మల్ డెలివరీకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు.ప్రాణం మీదకు వస్తే తప్పా ఆపరేషన్ చేసేవారు కాదు.
కానీ., ఈరోజుల్లో వందకు పది శాతం కూడా నార్మల్ డెలివరీలు అవ్వడం లేదు.
ఎక్కువగా సిజేరియన్ చేయించుకోవడానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు.
ఇలా డెలివరి విషయంలో తీసుకునే కొన్ని నిర్ణయాల వలన భవిష్యత్తులో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
నిజానికి ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే.సిజేరియన్ కంటే నార్మల్ డెలివరీనే చాలా మంచిది అని అంటున్నారు.
చాలామంది నార్మల్ డెలివరీ అంటే నొప్పులు పడాలి అవి మా వల్ల కాదని ఆపరేషన్ చేపించుకోవడానికి ఇష్టపడుతున్నారు.సిజెరియన్ అయితే మత్తు మందు ఇస్తారు నొప్పి లేకుండా పని అయిపోతుంది అనే ఆలోచనలో ఉంటున్నారు.
కానీ నార్మల్ డెలివరీనే చాలా మంచిది.నార్మల్ డెలివరీ అయితే ప్రసవం అయిన మూడు రోజులు మాత్రమే కొంచెం ఇబ్బంది పడతారు.
ఆ తర్వాత ఎటువంటి నొప్పులు అనేవి లేకుండా తల్లి తన పని తానే సులువుగా చేసుకోవచ్చు.ఒకరిపై ఆధారపడాలిసిన పని ఉండదు.
అదే ఆపరేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఎందుకంటే సిజెరియన్ సమయంలో వెన్నెముకకి మత్తు ఇచ్చేటప్పుడు తల కాళ్ళ దగ్గరకి వచ్చేటట్టు శరీరాన్ని వంచడం వలన ఆ సమయంలో చాలా నొప్పి ఉంటుంది.అలాగే ఆ మత్తు ప్రభావం వెన్నెముకపై దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో నడుము నొప్పి వస్తుంది.అలాగే నార్మల్ డెలివరీ చేయించుకుంటే శరీరం మీద ఎలాంటి గీతలు కూడా ఉండవు.
అదే సిజేరియన్ చేస్తే శరీరంపై కుట్లు పడతాయి.ఆ తర్వాత ఆ కుట్లు మానడానికి చాలా రోజులు సమయం పడుతుంది.
ఒక రెండు గంటలు నొప్పులు పడినాగాని నార్మల్ డెలివరీనే మంచిది.నార్మల్ డెలివరీ అయినా, సిజెరియన్ అయినాగానీ బిడ్డకు జన్మ ఇవ్వడం అంటే ఆడవాళ్ళకి పునర్జన్మ లాంటిది.