బాలయ్య షోకు పవన్ అందుకే రాలేదట.. ఇద్దరి దారులు వేరు కావడంతో?

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేస్తే బాగుంటుందని బాలయ్య, పవన్ అభిమానులు కోరుకుంటున్నారు.అన్ స్టాపబుల్ సీజన్1 ముగిసిన నేపథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్ 2కు ఈ కాంబినేషన్ ను సెట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 Reasons Behind Pawan Kalyan Not Attended For Unstoppable Show ,pawan Kalyan, Un-TeluguStop.com

అన్ స్టాపబుల్ సీజన్1 ఊహించని స్థాయిలో సక్సెస్ కావడంతో ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెల నుంచి సీజన్2 ను మొదలుపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఈ షో కోసం పని చేసిన బీవీఎస్ రవి అన్ స్టాపబుల్ షోకు పవన్ హాజరు కాకపోవడానికి గల కారణాలను వెల్లడించారు.

చిరంజీవి, వెంకటేష్ షూటింగ్ లతో బిజీగా ఉండటంతో ఈ షోకు హాజరు కాలేదని చెప్పిన బీవీఎస్ రవి నాగార్జునను ఇంకా సంప్రదించలేదని అన్నారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీకి అధినేత కావడం బాలయ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావడంతో వీళ్లిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే ఇద్దరి దారులు వేరు కావడం వల్ల జోరుగా చర్చ జరుగుతుంది.

అందువల్ల పవన్ కళ్యాణ్ ను ఈ షో కొరకు సంప్రదించలేదని బీవీఎస్ రవి వెల్లడించారు.మెగా హీరోలు అన్ స్టాపబుల్ షోకు రాకపోవడానికి షూటింగ్ లతో బిజీగా ఉండటమే కారణమని బీవీఎస్ రవి వెల్లడించారు.

అన్ స్టాపబుల్ షోకు హాజరైన అతిథులంతా సంతృప్తిని వ్యక్తం చేశారని బీవీఎస్ రవి అన్నారు.బాలయ్యపై ఉండే ఇష్టం, గౌరవం వల్ల రాజమౌళి ఈ షోకు వచ్చారని బీవీఎస్ రవి వెల్లడించారు.

బాలయ్య ఈ షోకు హోస్ట్ గా చేయడం వల్ల ఆహా ఓటీటీకి సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని బాలయ్య రెమ్యునరేషన్ ఎంతనే విషయం మాత్రం తనకు తెలియదని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube