భారతదేశంలో జరిగే పెళ్లిళ్లలో ఎమోషన్స్ ఉట్టిపడుతుంటాయి.పిల్లల్ని పెద్ద చేసి ప్రయోజకులుగా మార్చి వారికి పెళ్లి చేస్తున్నప్పుడు పెళ్లి మండపంలోనే తల్లిదండ్రులు ఎంతో భావోద్వేగానికి లోనవుతుంటారు.
ఇక వధూవరులు కూడా తమ తల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సి వస్తుందని భావోద్వేగానికి గురి అవుతారు.ముఖ్యంగా వధువు తన తండ్రిని వదల్లేక ఎంతో ఎమోషనల్ అవుతుంది.
అందుకే పెళ్లిళ్లలో కుటుంబ సభ్యులందరిలోనూ ఆనందభాష్పాలు రాలుతుంటాయి.గుండెల్ని మెలిపెట్టే ఈ సీన్లు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.
ఇలాంటి వీడియో తాజాగా నెట్టింట ప్రత్యక్షమైంది.దీన్ని చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్ అయిపోతున్నారు.
ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో మనం ఆకర్షణీయమైన పెళ్లి వస్త్రాలలో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న వధువును చూడొచ్చు.
అయితే ఆమెను పెళ్లి డ్రెస్ లో చూసిన వరుడు కంటతడి పెట్టుకున్నాడు.బహుశా వీరిద్దరూ ఎప్పటి నుంచో బాగా ప్రేమించుకుంటున్నారేమో! అయితే ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న మ్యారేజ్ మూమెంట్ వచ్చేయడంతో వరుడు ఎమోషనల్ అయ్యాడు.
వధువు కూడా వరుడు ఏడవడం తో బాగా ఎమోషనల్ అయ్యింది.వీళ్ళిద్దరూ తమ ప్రేమ సఫలమైందని, మ్యారేజ్ చేసుకుంటున్నామని ఎంతగానో సంతోషిస్తూ బాగా ఏడ్చేశారు.
వరుడు వధువు ఫేస్ పట్టుకొని ఆమెకి చిన్న ముద్దు ఇచ్చాడు.తర్వాత చెవిలో ఏదో చెబుతూ వరుడు వధువుని నవ్వించాడు.
ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఎంతో ఆనందంగా చిన్న డాన్స్ వేసి ఆశ్చర్యపరిచారు.
దీనికి సంబంధించిన వీడియోని వెడ్డింగ్ బెల్స్ అనే ఓ ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ షేర్ చేసింది.“ఇది చాలా ఎమోషనల్ గా ఉంది.వాళ్ల ప్రేమ ఎంతో స్వచ్చమైనది.
అలాగే శక్తివంతమైనది” అని వెడ్డింగ్ బెల్స్ హ్యాండిల్ ఒక క్యాప్షన్ జోడించింది.ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఫిదా అవుతున్నారు.“పెళ్లి కొడుకుల్లో చాలా తక్కువ మంది మాత్రమే కంటతడి పెట్టుకుంటారు.ఎందుకంటే స్వచ్ఛమైన లవ్ చాలా తక్కువ మందిలో ఉంటుంది.
ఇలాంటి వధువు తన జీవిత భాగస్వామి అయినందుకు అతగాడు తనని తాను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉండొచ్చు.అందుకే అలా ఏడుస్తున్నాడు.” అని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.