బిడెన్ టైమ్ బాలేదు కాబోలు..!!!

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధాన సూత్రదారి, పాత్ర దారి కరోనా మహమ్మారి అనేది విశ్లేషకుల అభిప్రాయం.సరిగ్గా ఎన్నికల ముందు కరోనా రావడం, ఎక్కడా లేనన్ని కేసులు అమెరికాలోనే నమోదవడంతో పాటు మృతుల సంఖ్య దారుణాతి దారుణంగా పెరగడంతో ట్రంప్ ఏం చేయలేకపోయారంటూ పదవి నుంచీ దించేశారు అమెరికన్స్.

 Supreme Court Blocks Biden's Covid-19 Vaccine Or Test Rule,us Supreme Court, Cov-TeluguStop.com

అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే కరోనా అంతు చూస్తా అన్న బిడెన్ అధికారంలోకి వచ్చేశారు.కట్ చేస్తే ప్రస్తుతం ట్రంప్ సమయంలో నమోదైన కేసులు, మృతుల సంఖ్య కంటే కూడా ఘోరంగా పరిస్థితి తయారయ్యింది.

దాంతో కాస్తో కూస్తో ట్రంపే బెటర్ అన్న ఫీలింగ్ కి మెజారిటీ ప్రజలు వచ్చేశారు.ఈ విషయంపై బిడెన్ కూడా తీవ్ర నిరాశతో ఉన్నారట.

కరోనా విషయంలోనే పెద్ద డ్యామేజ్ జరిగిందని భావిస్తున్న తరుణంలో ఆఫ్హాన్ లో బలగాలను వెనక్కి తీసుకొచ్చిన విషయంలో ప్రపంచ వ్యాప్తంగా మాత్రమే కాదు అమెరికన్స్ సైతం బిడెన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.దాంతో మరో సారి అమెరికన్స్ అభిమానం నుంచీ దూరంగా జరిగారు.

ఇక రోజు రోజుకు పెరిగిపోతున్న గన్ కల్చర్ ను నిరోధించడంలోనూ, జాత్యహంకార దాడులను నియంత్రించడంలో బిడెన్ గత ప్రభుత్వంకంటే కూడా వైఫల్యాలను చవి చూస్తున్నారని బాహాటంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదే సమయంలో

Telugu Donald Trump, Joe Biden, Omicron, Republican, Supreme-Telugu NRI

ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు, వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించడంలో బిడెన్ విఫలమయ్యారనే విమర్శలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి.ఇన్ని వైఫల్యాల మధ్యలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా కోర్టులు కూడా బిడెన్ విషయంలో వ్యతిరేక తీర్పులు ఇవ్వడంతో పరిస్థితి గందర గోళంగా మారింది.కరోనా కేసుల ఉదృతి తీవ్రమవుతున్న నేపధ్యంలో బిడెన్ సర్కార్ కొన్ని నిభందనలు విధించింది.

అయితే ఈ నిభంధనలపై ప్రజల తరుపున రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు కోర్టును ఆశ్రయించారు.దాంతో పని ప్రదేశంలో మాస్క్ తప్పనిసరి చేయడం, అలాగే వారానికి ఒకసారి కరోనా పరీక్షలు చేయించుకోవడం, వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడం లాంటి నిభందనలు విధించే హక్కు ప్రభుత్వానికి లేదని అమెరికా సుప్రీం కోర్టు తెలిపింది.100 మంది పనిచేసే కంపెనీలలో ఈ నిభందనలు వర్తింపజేయవచ్చునని తీర్పు చెప్పింది ఈ తాజా తీర్పుతో బిడెన్ మరో సారి ఖంగుతిన్నారు.బిడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మధ్య కాలంలో వరుసగా అట్టర్ ప్లాఫ్ లు అవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube