ఇండోనేషియా దిగ్గజ టెలికాం కంపెనీకి సారథిగా భారత సంతతి ఎగ్జిక్యూటివ్

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్ పేరు ఇప్పుడు భారత్‌తో పాటు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.ఇప్పటికే ప్రతిష్ఠాత్మక టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అడోబ్, మాస్టర్‌ కార్డ్‌లకు భారత సంతతి వ్యక్తులు అధిపతులుగా ఉండగా.

 India Born Vikram Sinha To Lead Pt Indosat Ooredoo Hutchison Tbk ,pt Indosat Oo-TeluguStop.com

ఇప్పుడు పరాగ్ అగర్వాల్ వారి సరసన చేరి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.ఈ నేపథ్యంలోనే ఆయనకు విశ్వ వ్యాప్తంగా వున్న భారతీయులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన విక్రమ్ సిన్హా.ఇండోనేషియాలోని దిగ్గజ టెలికాం సంస్థ ‘‘ PT Indosat Ooredoo Hutchison Tbk’’ కు సీఈవోగా నియమితులయ్యారు.

దీంతో ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను నడుపుతోన్న భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ల జాబితాలో స్థానం పొందారు.సెప్టెంబర్ 2021లో Indosat Ooredoo, Tri Indonesia PTలు విలీనమై.

Indosat Ooredoo Hutchison Tbk పేరుతో అతిపెద్ద సంస్థగా రూపాంతరం చెందింది.ఈ కంపెనీ డేటా కమ్యూనికేషన్, బ్రాడ్‌బ్యాండ్, మెసేజింగ్, వాయిస్ కాలింగ్, రోమింగ్, నెట్‌వర్కింగ్ సేవలను అందిస్తుంది.

విక్రమ్ సిన్హాకు టెలికమ్యూనికేషన్‌లో అపార అనుభవం వుంది.ఆయన Ooredoo గ్రూప్‌లో చేరడానికి ముందు భారత్, దక్షిణాఫ్రికాలో అతిపెద్ద టెలికాం సంస్థగా వున్న ఎయిర్‌టెల్‌లో దాదాపు 10 ఏళ్లు కీలక హోదాల్లో పనిచేశారు.

ఇప్పుడు Ooredooకు సీఈవోగా కావడం పట్ల విక్రమ్ సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.గడిచిన కొన్నేళ్లుగా భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వున్న టెక్ పవర్‌హౌస్‌ల విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు.

ఇప్పుడు Indosat Ooredoo Hutchison Tbkకు సారథిగా విక్రమ్ నియామకం భారతీయులందరికీ గర్వకారణమన్నారు.రాబోయే కాలంలో కంపెనీ మంచి టర్నోవర్‌ను సాధించడంలో విక్రమ్ అనుభవం తప్పకుండా దోహదపడుతుందని వారు ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube