వరుస దీక్షలతో దూకుడుగా బీజేపీ.. అసలు వ్యూహం ఇదేనా?

ప్రస్తుతం తెలంగాణలో  బీజేపీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కొరకు బీజేపీ ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడమే లక్ష్యంగా, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో పెంచుకుంటూ వెళ్ళి వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Bjp Aggressively With A Series Of Initiations Is This The Real Strategy, Bjp Tel-TeluguStop.com

అయితే తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 ను సవరణ  చేయాలని కరీంనగర్ లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ జీవో 317 తో ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ జీవోని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తునారని తక్షణమే ఈ జీవోను సవరించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ జాగరణ దీక్ష వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటంటే తాజాగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం అయిన ఎన్ఎస్యూఐ ఇంటర్ విద్యార్థుల సమస్యలపై చేసిన పోరాటంతో ప్రభుత్వం దిగి రావడంతో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చాలా లాభం జరిగిందని చెప్పవచ్చు.

అందుకే అదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీ కూడా అనుసరిస్తున్న పరిస్థితి ఉంది.ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేయడం ద్వారా ప్రభుత్వం జీవో సవరణకు పూనుకుంటే అది బీజేపీ సాధించిన విజయంగా వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు అదే విధంగా మిగతా వర్గాలు కూడా బీజేపీని ఆశ్రయించే అవకాశం ఉంది.

అయితే నేటి దీక్షపై ప్రభుత్వం నుండి కావచ్చు, ఇటు టీఆర్ఎస్ పార్టీ నుండి కావచ్చు ఎవరూ స్పందించకపోయినా దీక్ష తరువాత రేపు స్పందించే అవకాశం ఉంది.మరి ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube