ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అందాలభామ శ్రీయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
ఇప్పటికి శ్రీయ పలు సినిమాలలో కీలకపాత్రలో అవకాశాలు దక్కించుకొని వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కేరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్రేయ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్నారని చెప్పవచ్చు.
ఇక ఈమె 2018 వ సంవత్సరంలో రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చివ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.వీరిద్దరి అన్యోన్యత చూసి నెటిజన్లు సైతం ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.
కెరియర్ పరంగా బిజీగా ఉన్న శ్రియ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే శ్రియ తన భర్తతో కలిసి దిగిన కొన్ని రోమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.

ఇప్పటికే శ్రీయ పబ్లిక్ ప్లేస్ లో తన భర్తతో రోమాన్స్ చేస్తూ పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు.ఈ క్రమంలోనే ఈమె మరోసారి తన భర్తతో కలిసి ఘాటుగా లిప్ లాక్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శ్రియ ప్రస్తుతం తన భర్త కూతురుతో కలిసి గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.ఈ క్రమంలోనే గోవా వెకేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యాయి.