వెండితెరపై కనిపించే స్టార్ హీరోయిన్లు, కరోనా సమయంలో యూట్యూబ్ లో విడుదలయ్యే పలు వెబ్ సిరీస్ లో కూడా నటించారు.కరోనా సమయంలో వెబ్ సిరీస్ లో హీరోయిన్ లకు వెండితెర లేని లోటుని కొంతవరకు తీర్చాయి.
అలా ఈ ఏడాది కొందరు స్టార్ హీరోయిన్లు తొలిసారిగా ఓటీటీ లో సందడి చేశారు.కరోనా సమయంలోనూ థియేటర్లు మూతపడిన సమయంలో ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ లు ఎంటర్టైనర్ గా నిలిచాయి.
ప్రేక్షకులు సైతం తమ అభిమాన హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో నటిస్తుండటంతో చాలా ఆనందపడ్డారు.మరి నటించిన హీరోయిన్లు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వెండితెరపై ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవలే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసింది.తన కెరీర్ లో మొదటిసారిగా ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్ లో రాజ్యలక్ష్మి అనే పాత్రలో నటించింది సమంత.
ఆ పాత్ర అప్పట్లో కొంచెం వివాదంగా మారినప్పటికీ, ఆ తర్వాత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యాక సమంతా తన నటనతో అందరిని మెప్పించింది.
టాలీవుడ్ లో మరొక స్టార్ హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ కూడా తొలిసారిగా లైవ్ టెలికాస్ట్ అలాగే ఒక వెబ్ సిరీస్ పై ఆసక్తిని చూపించారు.అయితే ఆ వెబ్ సిరీస్ అనుకున్న విధంగా సక్సెస్ సాధించలేకపోయింది.
అలాగే తమన్నా కూడా ఈ ఏడాది లెవెన్త్ అవర్, నవంబర్ స్టోరీస్ అనే రెండు వెబ్ సిరీస్ చేసింది.
ఈమె వెండితెరపై పలు పాత్రలో నటించడమే కాకుండా, బుల్లితెరపై హోస్టుగా కూడా వ్యవహరించింది.అలాగే ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ అదే షోకి హోస్ట్గా కూడా వ్యవహరించింది.
అలాగే త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్ పుత్, పూర్ణ, అలాగే ఈషారెబ్బా కలిసి నటించారు.అలాగే ఈషా రెబ్బా పిట్టకథలు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
అలాగే టాప్ హీరోయిన్ శృతి హాసన్ కూడా హిందీలో ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.మణిరత్నం నిర్మించిన ఆంథాలజీ నవరస లో ఒక రోల్ చేసింది అంజలి.
అలాగే హీరోయిన్ త్రిష బ్రిందా అనే ఒక వెబ్ సిరీస్ కు సైన్ చేసిందట.ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ కు సంబంధించి షూటింగ్ జరుగుతోంది.
రుద్ర,షాహిద్ కపూర్ సన్నీ వెబ్ సిరీస్‌లలో రాశీ ఖన్నా నటించింది.
రెజీనా తొలిసారిగా రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
అలాగే సన్నీ వెబ్ సిరీస్‌లోనూ రెజీనా ఓ లీడ్ చేసింది.