ఆవిరి స్నానం.దీనిని స్ట్రీమ్ బాత్ అంటారు.
ఆయుర్వేద వైద్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆవిరి స్నానం.స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా వారానికి నాలుగు సార్లు ఆవిరి స్నానం చేస్తే గనుక అనేక రోగాలు పరార్ అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం స్ట్రీమ్ బాత్ చేయడం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ఇటీవల రోజుల్లోనే వయసు పై బడిన వారే కాదు చిన్న వయసు వారు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.అయితే తరచూ ఆవిరి స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులే కాదు కండరాలు నొప్పులూ పరార్ అవుతాయి.అలాగే స్ట్రీమ్ బాత్ చేయడం వల్ల ఒత్తిడి, తలనొప్పి, ఆందోళన, అలసట వంటి సమస్యలు గణనీయంగా తగ్గు ముఖం పట్టి మెదడు, మనసు రెండూ ఉత్తేజంగా మారతాయి.శరీరం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా తయారు అవుతుంది.
ఆవిరి స్నానం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ తొలగిపోతాయి.తద్వారా చర్మ ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.
అంటు వ్యాధులు దూరం అవుతాయి.నిద్ర లేమి సమస్యతో బాధపడేవారు వారంలో నాలుగు లేదా ఐదు సార్లు ఆవిరి స్నానం చేస్తే.
రాత్రుళ్లు చక్కగా నిద్ర పడుతుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా స్ట్రీమ్ బాత్ ఉపయోగపడుతుంది.
అవును, సరైన మార్గంలో స్ట్రీమ్ బాత్ చేస్తే గనుక.కేలరీలు సూపర్ బర్న్ అవుతాయి.ఫలితంగా బరువు తగ్గుతారు.అంతే కాదు, ఆవిరి స్నానం చేయడం వల్ల.చెమట రూపంలో శరీరం నుండి అన్ని రకాల టాక్సిన్స్ తొలగిపోతాయి.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రక్త పోటు స్థాయిలు అదుపులో ఉంటాయి.మరియు శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే.
వాటి నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.