టాలీవుడ్ 2021: రీమేక్ సినిమాలే హైలెట్?

తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్ సినిమాలు కొదవేమి లేదు.ఒక రకంగా చెప్పాలంటే నేటి రోజుల్లో రీమేక్ సినిమాలు ట్రెండ్ టాలీవుడ్ లో ఎక్కువగా నడుస్తుంది.

 Tollywood Movies Remakes In 2021 Details, Tollywood Remake Movies, Maestro, Red,-TeluguStop.com

ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు.స్టార్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు కూడా అందరి ద్రుష్టి రిమేక్ సినిమాల పైన ఉంది అని చెప్పాలి.

ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించాయ్.అదే సమయంలో ఇలా రీమేక్ అయ్యి నిరాశపరిచిన సినిమాలు కూడా ఉన్నాయి.ఇలా ఇటీవల కాలంలో టాలీవుడ్లో విడుదలైన సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

వకీల్ సాబ్ :

Telugu Telugu, Asuran, Maestro, Ppa, Pawan Kalyan, Satyadev, Timmarusu, Tollywoo

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ మెగాస్టార్ అమితబ్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ కావడం గమనార్హం కథలో పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్లు కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు.ఇక ఈ సినిమా పవన్ కు అసలు సిసలైన కమ్ బాక్స్ సినిమాగా నిలిచింది.

నారప్ప – దృశ్యం 2 :

Telugu Telugu, Asuran, Maestro, Ppa, Pawan Kalyan, Satyadev, Timmarusu, Tollywoo

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో గా కొనసాగుతున్న వెంకటేష్ రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.రిమేక్ సినిమాలతో మంచి విజయాలను కూడా అందుకుంటున్నాడు.తమిళ చిత్రం అసురన్ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన నారప్ప సినిమా మంచి విజయాన్ని అందుకున్నారు.

మాలీవుడ్ మూవీ దృశ్యం రీమేక్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓటిటి లో కూడా అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు వెంకటేష్.వెంకటేష్ సినిమా చేసిన ఈ రెండు సినిమాలు కూడా ఓటిటీలో విడుదల కావడం గమనార్హం.

రెడ్ :

Telugu Telugu, Asuran, Maestro, Ppa, Pawan Kalyan, Satyadev, Timmarusu, Tollywoo

తమిళ్ సినిమాలు తెలుగులో రీమేక్ చేయడం ఇటీవలి కాలంలో ట్రెండ్గా మారింది.ఇక ఇదే కోవలో తమిళ్ సినిమా తడమ్ తెలుగు రిమేక్ గా రూపొందింది రెడ్ సినిమా. ఈ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించారు.ఈ సినిమాలో రామ్ మొదటిసారి ద్విపాత్రాభినయం చేయడం గమనార్హం.ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో మాత్రం విజయం సాధించలేదు.

మాస్ట్రో :

Telugu Telugu, Asuran, Maestro, Ppa, Pawan Kalyan, Satyadev, Timmarusu, Tollywoo

నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘అందాదున్’ రీమేక్ కావడం గమనార్హం.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా విడుదలయ్యింది.ఇక ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

Telugu Telugu, Asuran, Maestro, Ppa, Pawan Kalyan, Satyadev, Timmarusu, Tollywoo

అలాగే సత్యదేవ్ హీరోగా తెర‌కెక్కిన `తిమ్మ‌రుసు` క‌న్న‌డ సినిమా `బీర్బ‌ల్ తెలుగు రీమేక్ గా తెరకెక్కింది.ఈ సినిమా అంతంత మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది.మ‌ల‌యాళ మూవీ `ఇష్క్`కి రీమేక్ ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు తేజ సజ్జ‌, క‌న్న‌డ సినిమా `దియా` సినిమా తెలుగులో `డియ‌ర్ మేఘ‌` గా రీమేక్ చేయగా (మేఘా ఆకాశ్) ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube