ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.ఎవరికీ వారు రకరకాల డిషెస్ చేసి వాటికి ఒక పేరు పెట్టి మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు.
వెరైటీ ఫుడ్ కాంబినేషన్స్ అని చెప్పి జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.రకరకాల టేస్టీ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ తినాలని భావించే వారి ఆసక్తిని గ్రహంచి వివిధ రకాల పేర్లతో సరి కొత్త ప్రయోగాలు చేసేస్తున్నారు.
మొన్నటికి మొన్న ఒరియో బిస్కెట్స్ తో బజ్జిలు, గుడ్డుతో పాప్ కార్న్, బటర్ చికెన్ గోల్‌గప్ప, ఐస్ క్రీమ్ దోశ, పెరుగు చట్నీ రసగుల్లా చాట్ వంటి రకరకాల పేర్లతో వెరైటీ వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక రెండు కొత్త వంటకాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అవేమంటే.పానీపురి ఐస్ క్రీమ్, యాపిల్ పకోడీ.
ఏంటి అసలు ఏందిరా ఈ కాంబినేషన్స్ అని షాక్ అవుతున్నారా.ప్రస్తుతం ఈ రెండు వంటకాలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి ముందుగా యాపిల్ పకోడీ గురించి తెలుసుకుందాం.
యాపిల్ తో పకోడీ అంటే వినడానికి వెరైటీగా ఉంది కదా.కానీ ఒక ఫుడ్ వ్లాగర్ ఈ సరికొత్త వంటకాన్ని చేసి తన ఇన్‌స్టాలో షేర్ చేయటంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఆపిల్ ను పిండి మిశ్రమంలో ముంచి బాగా కాగిన నూనెలో వేపడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.
ఇక పోతే.పానిపూరి ఐస్ క్రీమ్.పానీపూరీ అంటే మనకు తెలిసి పూరిలో కూరతో పాటు పానీ కూడా ఉంటుంది.
కానీ ఇక్కడ మాత్రం పూరీలో పానికి బదులుగా ఐస్‌క్రీమ్ ఉంది.ఈ వెరైటీ పానీపూరీ ఐస్‌క్రీమ్‌ను బెంగళూరుకు చెందిన అంజలి ధింగ్రా అనే ఫుడ్ బ్లాగర్ ట్రై తింటూ తీసిన వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసింది .బెంగళూరులోని డాక్ ఫ్రోస్టెడ్ అనే ఓ హోటల్ లో ఈ పానీ పూరీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేస్తారట.దాన్ని ఆర్డర్ చేసి.
ఇంటికి తెప్పించుకుని టేస్ట్ చేసింది అంజలి.నాట్ బ్యాడ్ అంటూ కితాబు కూడా ఇచ్చింది మరి.ఈ వెరైటీ వంటకాలను చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.