యాంకర్ రవి సహా బిగ్ బాస్ తెలుగులో షాకింగ్ ఎలిమినేషన్లు ఇవే?

బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లేని కంటెస్టెంట్లు గతంలో బిగ్ బాస్ షోకు విజేతలుగా నిలిచి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

 Bigg Boss Telugu 5 Reasons Behind Ravi Elimination Bigg Boss House Details, Rav-TeluguStop.com

అయితే కొంతమంది కంటెస్టెంట్ల ఎలిమినేషన్లు ప్రేక్షకులను షాక్ కు గురి చేశాయి.టాప్ 5లో ఉండాల్సిన రవిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గత సీజన్లలో కూడా ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్లు జరిగాయి.

బిగ్ బాస్ షో సీజన్ 1లో ప్రిన్స్ ఎలిమినేషన్ ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది.

టైటిల్ రేసులో ప్రిన్స్ ఉంటాడని భావించిన ప్రిన్స్ అభిమానులు అతని ఎలిమినేషన్ తో నిరాశకు గురయ్యారు.బిగ్ బాస్ సీజన్ 2లో శ్యామల ఎలిమినేషన్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

శ్యామలకు లేడీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే.శ్యామల్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని కామెంట్లు వినిపించగా ఆమె హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్లలో అలీ రేజా ఒకరు కాగా టాప్ 5లో అలీరేజా ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తే అలీ రేజా మాత్రం ఎలిమినేట్ అయ్యారు.

Telugu Anchor Ravi, Bigg Boss Fans, Bigg Boss, Devi Nagavalli, Ravi-Movie

బిగ్ బాస్ సీజన్ 4లో దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.దేవి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని కామెంట్లు వినిపించినా ఆమెకు షోలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం మాత్రం దక్కలేదు.సీజన్ 5లో రాబోయే వారాల్లో కూడా అన్ ఫెయిర్ ఎలిమినేషన్లు జరుగుతాయెమో చూడాల్సి ఉంది.

Telugu Anchor Ravi, Bigg Boss Fans, Bigg Boss, Devi Nagavalli, Ravi-Movie

పెద్దగా క్రేజ్ లేని కంటెస్టెంట్లు హౌస్ లో కొనసాగుతుండగా క్రేజ్ ఉన్న రవి ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ అభిమానులను బాధ పెడుతోంది.రవి ఎలిమినేషన్ కు సంబంధించి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube