యాంకర్ రవి సహా బిగ్ బాస్ తెలుగులో షాకింగ్ ఎలిమినేషన్లు ఇవే?

బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.ప్రేక్షకుల్లో పెద్దగా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లేని కంటెస్టెంట్లు గతంలో బిగ్ బాస్ షోకు విజేతలుగా నిలిచి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

అయితే కొంతమంది కంటెస్టెంట్ల ఎలిమినేషన్లు ప్రేక్షకులను షాక్ కు గురి చేశాయి.టాప్ 5లో ఉండాల్సిన రవిని అన్యాయంగా ఎలిమినేట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గత సీజన్లలో కూడా ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్లు జరిగాయి.బిగ్ బాస్ షో సీజన్ 1లో ప్రిన్స్ ఎలిమినేషన్ ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది.

టైటిల్ రేసులో ప్రిన్స్ ఉంటాడని భావించిన ప్రిన్స్ అభిమానులు అతని ఎలిమినేషన్ తో నిరాశకు గురయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 2లో శ్యామల ఎలిమినేషన్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.

శ్యామలకు లేడీస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం తెలిసిందే.శ్యామల్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని కామెంట్లు వినిపించగా ఆమె హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు.

బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్లలో అలీ రేజా ఒకరు కాగా టాప్ 5లో అలీరేజా ఉంటాడని ఫ్యాన్స్ భావిస్తే అలీ రేజా మాత్రం ఎలిమినేట్ అయ్యారు.

"""/"/ బిగ్ బాస్ సీజన్ 4లో దేవి నాగవల్లి ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

దేవి ఎలిమినేషన్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని కామెంట్లు వినిపించినా ఆమెకు షోలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం మాత్రం దక్కలేదు.

సీజన్ 5లో రాబోయే వారాల్లో కూడా అన్ ఫెయిర్ ఎలిమినేషన్లు జరుగుతాయెమో చూడాల్సి ఉంది.

"""/"/ పెద్దగా క్రేజ్ లేని కంటెస్టెంట్లు హౌస్ లో కొనసాగుతుండగా క్రేజ్ ఉన్న రవి ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ అభిమానులను బాధ పెడుతోంది.

రవి ఎలిమినేషన్ కు సంబంధించి వేర్వేరు కారణాలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు ఆ హీరో చెక్ పెడుతున్నాడా..?