తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే అన్నాత్తే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా తమిళంలో మంచి వసూళ్లను నమోదు చేసుకుంది.
అయితే తెలుగు లో మాత్రం పెద్దన్నా గా విడుదల అయ్యి నిరాశ పర్చింది.అత్యంత దారుణమైన వసూళ్లను నమోదు చేయడంతో రజినీకాంత్ పరువు పోయినంత పనైంది.
అయితే అన్నాత్తే తమిళంలో మాత్రం వంద కోట్ల వరకు వసూళ్లు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.రజినీకాంత్ సినిమాలు ఎలా ఉన్నా కూడా అక్కడి అభిమానులు చూస్తారని మరోసారి నిరూపితం అయ్యింది.
ఆయన వయసు రీత్యా సినిమాల సంఖ్య తగ్గిస్తున్నట్లుగా తెలుస్తోంది.అన్నాత్తే సినిమా తర్వాత రజినీకాంత్ చేయబోతున్న సినిమా ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో రజినీకాంత్ నుండి కీలక ప్రకటన రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
డిసెంబర్ 12వ తారీకున రజినీకాంత్ పుట్టిన రోజు ఉంది.ఆయన పుట్టిన రోజు సందర్బంగా కొత్త సినిమా ప్రకటన ఉంటుందని అంటున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే ఈయన దర్శకత్వంలో రజినీకాంత్ పెటా సినిమాను చేశాడు.ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
అయినా కూడా కార్తీక్ సుబ్బరాజు వర్కింగ్ స్టైల్ నచ్చడంతో పాటు ఆయన ఇతర సినిమాలను చూసిన రజినీకాంత్ మరో అవకాశం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది.పెటా సినిమా సమయం లోనే వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తుందనే ప్రచారం జరిగింది.
తాజాగా ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయి.డిసెంబర్ 12న రజినీకాంత్ బర్త్ డే సందర్బంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
రజినీకాంత్ అభిమానులు కూడా ఈ కాంబోను కోరుకుంటున్నారు.తమిళంలో విలక్షణ దర్శకుడిగా రజినీకాంత్ పేరు దక్కించుకున్నాడు.