కొన్ని కొన్ని సార్లు కొందరు చేసే తప్పుల వల్ల ఇతరులకు నష్టం జరుగుతుంది.అది ఏ విషయంలోనైనా సరే ఇతరుల వల్ల కొందరు అనవసరంగా నష్టాలు ఎదుర్కొంటారు.
తమ తప్పు లేకున్నా ఇతరులు చేసే పొరపాట్ల వల్ల శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.అలా ఏ రంగంలోనైనా కొన్ని కొన్ని సార్లు జరుగుతూ ఉంటాయి.
ఇక సినీ ఇండస్ట్రీలో కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.అందులో ఏకంగా నిత్యమీనన్ వల్ల ఓ ఇద్దరి ఉద్యోగాలు పోయాయట.
టాలీవుడ్ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి అందరికీ పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అతి తక్కువ సమయంలో ప్రేక్షకుల హృదయాలను దోచుకొని మంచి అభిమాన హీరోయిన్ గా నిలిచింది.ఇక స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
తెలుగుతో పాటు తమిళ, ఇంగ్లీష్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 1998లో బాలనటిగా అడుగు పెట్టింది.
ఆ తర్వాత 2010లో అలా మొదలైంది సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఆ తర్వాత వరుసగా ఎన్నో అవకాశాలు అందుకోగా తనకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు మంచి సక్సెస్ ను ఇచ్చాయి.

కొన్ని సినిమాలలో అతిధి పాత్రలలో కూడా నటించింది.ఇప్పటివరకు నిత్యా మీనన్ ఎటువంటి వాదనలలో చిక్కుకోలేదని అందరికీ తెలుసు.కానీ గతంలో నిత్య మీనన్ వల్ల ఇద్దరు ఉద్యోగాలు పోయాయని తెలిసింది.
ఇదంతా తన తొందరపాటు వల్ల జరిగిందని తెలిసింది.గతంలో నిత్యామీనన్ హైదరాబాద్ నుండి బెంగళూరు ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న సమయంలో సాధారణ ప్రయాణికుల సీటులో కూర్చోకుండా కాస్త ఓవరాక్షన్ చేసిందట.

దీంతో ఆమె సినిమా స్టార్ కావడంతో ఆమె దృష్టి అందరిపై పడటంతో పాటు పైలెట్ లను కూడా ఆకట్టుకుంది.దీంతో తనను ఏకంగా కాక్ పిట్ లోకి రానిచ్చారట.ఇక ఇదంతా గమనించిన ఎయిర్ వేస్ అధికారి ఇండియన్ ఎయిర్ లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఇద్దరి పైలెట్ లను సస్పెండ్ చేశారట.మొత్తానికి నిత్యామీనన్ వల్ల ఓ ఇద్దరి ఉద్యోగాలు అనవసరంగా కోల్పోయాయి.

ఈ విషయం అప్పట్లో అందరికీ తెలియగా అందరూ నిత్యా మీనన్ పై తెగ కామెంట్లు చేశారు.ఇక నిత్యామీనన్ ఈ ఏడాది వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో కూడా నటిస్తుంది.ఈ సినిమాలో పవన్ భార్యగా కనిపించనుంది నిత్యామీనన్.ఇక సైకో సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది నిన్నిలా నిన్నిలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోయింది.
ఇక భీమ్లా నాయక్ తో ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.