అమెరికా: హెచ్‌ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గుడ్‌న్యూస్.. బైడెన్ యంత్రాంగం కీలక నిర్ణయం

హెచ్ 1 వీసాదారుల జీవిత భాగస్వాములకు అమెరికా ప్రభుత్వం ఊరట కలిగింది.వారికి ఇక నుంచి ‘ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌’ కింద అనుమతులు ఇచ్చేందుకు బైడెన్‌ యంత్రాంగం అంగీకరించింది.ఈ వ్యవహారంపై హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాముల తరఫున అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) వేసిన పిటిషన్‌పై అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సానుకూలంగా స్పందించింది.

 Biden Admin Settles For Automatic Job Authorisation For Spouses Of H 1b Visa Hol-TeluguStop.com

హెచ్‌-4 వీసాదారుల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్‌ పత్రాల రెన్యూవల్ కోసం తరచూ రెగ్యులేటరీ పరీక్షలు నిర్వహిస్తుంటారు.అయితే, గతంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించడంతో వారు రీ-ఆథరైజేషన్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.దీనిపై వలసదారుల జీవిత భాగస్వాములు ఏఐఎల్‌ఏను ఆశ్రయించగా.

వారు హోంల్యాండ్‌ సెక్యూరిటీస్‌ విభాగంలో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై తాజాగా బైడెన్‌ సర్కార్ సానుకూలంగా స్పందించింది.

దీంతో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఇకపై తమ ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ పొడగింపు కోసం ఎదురుచూడకుండా ఆటోమెటిక్‌గా వర్క్ పర్మిట్స్ పొందనున్నారు.ఈ నిర్ణ‌యం వ‌ల్ల వేలాది మంది ఇండో-అమెరిక‌న్ మ‌హిళ‌ల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది.

Telugu Automatic, Biden, Bidenadmin-Telugu NRI

సాధారణంగా హెచ్‌1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అది లభించడానికి సుమారు 15 ఏళ్లు పడుతుంది.ఈలోగా హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వామి అమెరికాలో ఉద్యోగంలో చేయడానికి అనుమతి ఉండేది కాదు.వీరి ఆవేదనను అర్ధం చేసుకున్న నాటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా 2015లో హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌) బిల్లు తెచ్చారు.దీని ప్రకారం హెచ్‌1బీపై పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వారి జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించారు.

దీనికి అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలపింది.దీనివల్ల 1.34 లక్షల మంది భారతీయ మహిళలు యూఎస్‌సీఐఎస్‌ నుంచి ఈఏడీ పొంది తమకు నచ్చిన ఉద్యోగాల్లో చేరారు.

జీవిత భాగస్వామి హెచ్‌1బీ గడువుకు అనుగుణంగా హెచ్‌4 వీసా రెన్యూవల్‌ చేస్తారు.

అయితే ఏడాదిన్నరగా కరోనా తదితర కారణాలతో యూఎస్‌సీఐఎస్‌ ఈఏడీ రెన్యూవల్‌ చేయట్లేదు.దీంతో మార్చి 31 నాటికి సుమారు 91 వేల మంది భారతీయ మహిళలు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయి వారి కుటుంబాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

దీనిపై భారతీయులు పలు కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయపోరాటం సైతం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube