సినీ పరిశ్రమలో కొన్ని తేదీలను ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు? మరికొన్ని తేదీలను మ్యాజిక్ డేట్స్ గా కూడా భావిస్తారు ఎందుకని? అదేంటోగాని ఆ రోజు విడుదలైన సినిమాలు భారీ విజయాన్ని సాధించడమే కాక, చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కుంటాయి.అంతే కాదు ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు మరియు దర్శకులు మ్యూజిక్ డైరెక్టర్ లు మంచి వాళ్లకు మంచి పేరును కూడా తెచ్చి పెడతాయి.
అలాంటిదే ఏప్రిల్ 28.
ఎందుకంటే 1977 లో సరిగ్గా ఇదే రోజున ఎన్టీఆర్ హీరోగా నటించిన అడవి రాముడు ప్రజలకు ఎంతో చేరువై ఓ ట్రెండ్ ను సృష్టించింది.అప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు అందనంత భారీ విజయం దక్కింది అప్పట్లోనే నాలుగు కోట్లకు పైగా వసూళ్లను సంపాదించిపెట్టింది.ఈ సినిమాను అమాంతం ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుదే.
అంతే కాకుండా ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ ను ఓ పదేళ్ళు పెంచేసి, కమర్షియల్ సినిమాలకు గ్లామర్ గా నిలిచింది.ఇప్పటివరకు నాలుగు కేంద్రాల్లో ఏడాది ఆడిన అడవి రాముడు సినిమా రికార్డ్ ను బ్రేక్ చేయడం ఎవరి తరం కాలేదు.1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో హీరో ఆలీ తీసిన యమలీల చిత్రం కూడా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది.అద్భుతమైన పాటలు, ఆరోగ్యకరమైన హాస్యంతో తీసిన ఈ సినిమా, భారీ పోటీ ఉన్న సమయంలోనూ ఈ సినిమా అనుకోని రీతిలో వసూళ్లను సాధించడం నిజంగా గొప్ప విషయమే.
ఇక 2006లో వచ్చిన పోకిరి సినిమా గురించి అందరికీ తెలిసిందే.హీరో మహేష్ బాబు డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి చేసిన మాస్ మ్యూజిక్ ఇప్పటికీ అంతే ఫ్రెష్ గా అనిపించటం నమ్మశక్యం కాని విషయమే.మాఫియా కథను అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ అనే పాయింట్ ను జతచేసి పూరి ఇచ్చిన ట్విస్ట్ కి వరుసగా 175 రోజుల పాటు కాసుల వర్షం కురుస్తూనే ఉంది.
ఇదిలా ఉండగా 2017లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు భారీ బడ్జెట్ తో వచ్చిన బాహుబలి సినిమా కూడా ఏప్రిల్ 28న రిలీజ్ అయింది.తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవల్లో నిలబెట్టి, కలలో కూడా ఊహించని వేల కోట్లను అలవోకగా సాధించి బాహుబలి ముందు, తర్వాత అని సృష్టించిన రాజమౌళి వల్లే నటుడు ప్రభాస్ కూడా దేశ విదేశాల్లోనూ అత్యంత పేరును సంపాదించుకున్నారు.
ఈ నాలుగు సినిమాలు కూడా ప్రత్యేక కథను కలిగి, భారీ విజయాన్ని సాధించడం గమనార్హం.యమలీల అనే సినిమా మిగతా మూడింటికి సమాన స్థాయి కాకపోయినా, ఒక మామూలు కమెడియన్ గా ఉన్న అలీకి ఈ సినిమా తర్వాత 50 సినిమాల్లో హీరోగా అవకాశం రావడం మామూలు విషయం కాదు కదా.అలా అని ఈ డేట్ లో అసలు ప్లాప్స్ రాలేదని కాదు.కానీ ఈ డేట్ లో వచ్చిన ఈ నాలుగు సినిమాలు మాత్రం భారీ విజయాన్ని సాధించడం మాత్రం చెప్పుకోదగిన విషయం.