ప్రముఖ భారతీయ సినీ ఫైట్ మాస్టర్, కొరియోగ్రాఫర్‌గా పేరు గాంచిన స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్.ఈ పేరు వినగానే ఎన్నో ఫైట్ సీన్స్ కళ్లముందు అలా కదులుతూ ఉంటాయి.
అన్నయ్య, ముత్తు, నరసింహ, ఎదురులేని మనిషి, రాజా, నాయక్, వినయ విధేయ రామ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గొప్ప సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పని చేసి తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు.ప్రస్తుతం ఇండస్ట్రీకి పరిచయమవుతున్న మరెంతో మంది నూతన సినీ హీరోలతో సైతం ఆయన వర్క్ చేసి తన టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారు.
తమిళ, తెలుగు, మళయాలం, కన్నడ, హిందీ సినిమాలకు స్ర్కీన్ రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కన్నన్.అంతే కాకుండా అజిత్ కుమార్, విజయ్, శరత్ కుమార్ లాంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేసి, అందరితోనూ ఆయన మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు.
ఇవే కాకుండా మరి కొన్ని సినిమాలకు స్టంట్ మాస్టర్‌గానూ చేసి తన ఇమేజ్‌ను మరింత పెంచుకున్నారు.ఇప్పటివరకు దాదాపు 800 సినిమాల్లో భాగస్వామ్యమైన కనల్ కన్నన్‌కు సినీ ఇండస్ట్రీతో సుమారు 35 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా లైఫ్ ఇప్పుడు చాలా బాగుందని ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ తెలిపారు.ఇప్పుడు కూడా తన ఇంట్లో ఓ పది భోజనం చేస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
ఎవరైనా తాము భోజనం సమయానికి వస్తే లేదు అని చెప్పిన సందర్భాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు.

ఇకపోతే తాను 1987లో ఇక్కడికి వచ్చినపుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని కన్నన్ అన్నారు.చాలా మంది తమ లైఫ్‌లో ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు.కానీ, తను అనుభవించిన కష్టాలు చాలా డిఫరెంట్ అని ఆయన తెలిపారు.
అవేంటంటే తాను అప్పట్లో చాలా సన్నగా ఉన్నానన్న కన్నన్, మీసం కూడా చాలా చిన్నగా ఉండేదని చెప్పుకొచ్చారు.అందరూ దాన్ని చూసి నువ్వు ఫైటరా ? స్టంట్ మాస్టరా ? అని ప్రశ్నించడమే కాకుండా తను ఫైట్ మాస్టర్ అంటే ఎవరు నమ్మడం లేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.