రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అంత ఈజీ కాదు.ఒక్కోసారి మహా నేతలే చతికిల పడుతుంటారు.
రాబోయే ప్రమాదాన్ని ముందస్తుగా పసిగట్టలేకపోతే ఎంత రాజకీయ చాణక్యుడు అయినా సరే చివరకు ఇబ్బందుల పడక తప్పదు.ఈ విషయాన్ని చంద్రబాబును చూస్తేనే అర్థం అవుతుంది.
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయిలో ఉన్న చంద్రబాబు ఇప్పుడు కనీసం సొంత నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఇక్కడో ఓ విషయం గమనిస్తే ఒకప్పుడు చంద్రబాబుకు, ఇప్పుడు కేసీఆర్‌కు జరిగనట్టు కనిపిస్తోంది.
మరి రాజకీయాలు అంఏ అంతే కదా.చరిత్ర పునరావృతం అవుతుందన్న విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు.అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది.ఒకప్పునడు ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్న సమయంలనే చంద్రబాబును వ్యతిరేకించి మరీ తన పదవికి రాజీనామా చేశారు కేసీఆర్.
సొంతంగా పార్టీ పెట్టి మరీ ఉప ఎన్నికల్లో టీడీపీ మీద సంచలన విజయం సాధించారు.ఆనాడు చంద్రబాబుకు చుక్కలు చూపించిన కేసీఆర్ ఎంతలా హవా సాగించారో తెలిసిందే.
కాగా ఇప్పుడు ఆ సీన్ మళ్లీ రిపీట్ అయింది.
ఇప్పుడు కేసీఆర్ కు అలాంటి అనుభవమే ఎదురవుతోంది.
ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలోనే ఈటల రాజేందర్ ఆయన్ను విభేదించి ఉప ఎన్నికలకు వెళ్లారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఎంతలా ఖర్చు పెట్టినా తన సర్వ శక్తిని ఒడ్డినా ఓటమి తప్పలేదు.
దీంతో ఇప్పుడు ఈటల రాజేందర్ హవా తెలంగాణలో పెరిగే అవకాశం ఉంది.అప్పుడు కేసీఆర్ గెలిచిన తర్వాత టీడీపీ 2004లో ఓడిపోయింది.మళ్లీ ఇన్నేండ్లకు అలాంటిదే జరగడంతో రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడుతారన్నది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ చంద్రబాబుకు జరిగినట్టే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు జరిగితే మాత్రం పెద్ద పరాభవమే అవుతుంది.
.