అనుపమ పరమేశ్వరన్ ఈమె గురించి ప్రతేకంగా పరిచయం అక్కర్లేదు.అనుపమ కి ఫాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనకు తేలిసిందే.
తొలి సినిమాతోనే ఆమె తనదైన ముద్రను వేసుకుంది.తెలుగు, తమిళం, మలయాళం చిత్రసీమలో తనదైన శైలిలో దూసుకుపోతోంది.
తన అందంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకుంది.అనుపమ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
ఇక అనుపమ తెరపై ఏ విధంగా ఉంటుందో తెర వెనుక కూడా అంతే సరదాగా ఉంటుంది.
ఇటీవలే ఒక ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్ తో అనుపమ ఎంత వైరల్ అయ్యిందో మనకు తెలిసిందే.
అందులో విజయ్ దేవరకొండ అనుపమ ఇంకా చిన్నపిల్ల లాగే కనిపిస్తోంది, ప్రేమమ్ సినిమా లోని మేరీ ని చూసినట్టు అనిపిస్తోంది అన్నారు.మొత్తానికి ఇప్పుడు పెద్దది అయ్యింది మహిళగా ఎదిగింది అని కొంచెం కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ.
విజయ్ చేసిన కామెంట్ లకు అనుపమ తేదిని సిగ్గుపడి, తల కిందకు వేసుకుని నవ్వేసింది.విజయ్ చెప్పినట్టుగానే ఇంకా మేరి లానే ఉంది అనుపమ.

ఆమె తన సోదరుడు అక్షయ్ తో కూడా ఇంకా అలానే అల్లరి చేస్తూ ఉంటుంది.ఇద్దరు చిన్న పిల్లల పోట్లాడుకుంటూ ఉంటారు.ఇక అక్షయ్ చదువుకుంటే అనుపమ డిస్టర్బ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటుంది.తాజాగా అనుపమ తనకు ఎలాంటి సమయంలో కోపం వస్తుందో చెప్పేసింది.తను ఫోటో తీయమని తన తమ్ముడు చెబితే ఇలాంటి ఫీలింగ్ కలుగుతుందట.తల తీసి అవతల పారేయాలి అన్న ఫీలింగ్ అనుపమకు వస్తుందట.