మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది ఎలియన్స్ తో వస్తుందని అమెరికా మిలటరీ అధికారి చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.మూడవ ప్రపంచ యుద్ధం వస్తే గిస్తే దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న పోటీ తత్వం కారణంగా, అణ్వాయుదాల కారణంగా, పారిశ్రామిక ఒప్పందం కారణంగా అలాగే సరిహద్దుల గొడవల కారణంగా రావచ్చునని భావించారు.
ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు కాబట్టి అన్ని దేశాలు తమ సైనిక శక్తిని అభివృద్ధి చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో అమెరికా మిలటరీ ఆఫీసర్ రాబర్ట్ సలార్ సంచలన ప్రకటన చేశారు.
అమెరికా అత్యంత ఆధునాత సాంకేతిక అణు క్షిపణిగా ఉన్న టైటాన్ -3 ప్రోగ్రామ్ లో ఇంజనీర్ గా అలాగే అమెరికా వెపన్ కంట్రోలర్ గా పనిచేస్తున్న సలార్ మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది తప్పకుండా ఎలియన్స్ తో జరుగుతుందని ప్రకటించి ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేశారు.మన దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొంటే ఎవరో ఒకరు కల్పించుకుని సమస్యను పెద్దది కాకుండా చేసే అవకాశాలు ఉన్నాయని, ఎలియన్స్ తో యుద్ధం అంటూ వస్తే దారుణం జరగడం ఖాయమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే ఎందుకు సలార్ ఈ విషయంపై ఇంత క్లారిటీగా ఉన్నారంటే.ఎలియన్స్ అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేస్తున్నట్లుగా తాము గుర్తించినట్టుగా ఆయన ప్రకటించారు.
ఎలియన్స్ మరొక గ్రహం నుంచీ ఇక్కడకు వచ్చి అణు క్షిపణుల వద్ద ఉండే ఆయుధాలను నిర్వీర్యం చేస్తున్నారని, వాటిని పనిచేయకుండా నిలిపివేస్తున్నారని గుర్తించినట్టుగా ఆయన తెలిపారు.ఈ క్రమంలో కొన్ని అణు క్షిపణులను అవి యాక్టివేట్ చేస్తూనే కొన్ని బాలిస్టిక్ క్షిపణులను నిర్వీర్యం చేసినట్టుగా సలార్ వెల్లడించారు.
ఈ విషయాలను త్వరలో అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆధారాలతో సహా వెల్లడిస్తారని ప్రకటించారు.