సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంత సమయంలోనే ఎంతో మంచి అవకాశాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీతి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉందనగా ఈ బ్యూటీ పెళ్లి వైపు అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి తన తన ప్రేమను వ్యక్తం చేస్తూ అతనితో కలిసి దిగినటువంటి ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికి ఈ విషయాన్ని రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా వెల్లడించారు.
ఈ విషయం తెలిసిన నెటిజన్లు అసలు ఈ జాకీ ఎవరు ఏమిటి అనే విషయాల గురించి నెట్టింట్లో పెద్దఎత్తున సెర్చ్ చేస్తున్నారు.అసలు ఈ జాకీ ఎవరు అనే విషయానికి వస్తే అతడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

కోల్‌కతాలోని సింధీ ఫ్యామిలిలో జన్మించిన జాకీ తన తండ్రి పూజా ఎంటర్టైన్‌మెంట్స్ పేరు మీద సినిమాలను నిర్మించేవారు.ఈ క్రమంలోనే జాకీ కూడా తన తండ్రి బాటలోనే సినిమాలను నిర్మిస్తూ పలు సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అక్షయ్ కుమార్ జంటగా నటించినటువంటి సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకోబోతున్నాడు.ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో పలువురు సినీ తారలు ఈమెకు సోషల్ మీడియా వేదికగా ఈమెకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.