మహేష్ బాబుతో నేను అలా ప్రేమలో పడ్డాను.. నమ్రత కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ దంపతులకు గౌతమ్, సితార పేర్లతో ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

 Star Hero Mahesh Babu Namrata Love Story Details Here, Namrata , Love Story ,-TeluguStop.com

అయితే వీళ్లిద్దరి ప్రేమకథ గురించి మాత్రం అభిమానులకు పెద్దగా తెలియదు.అటు మహేష్ ఇటు నమ్రత వివాదాలకు సైతం దూరంగా ఉంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో మహేష్ నమ్రతల జోడీ ఒకటి కాగా 2000 సంవత్సరంలో వీళ్లిద్దరూ కలిసి వంశీ అనే సినిమాలో నటించారు.వంశీ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకున్నా ఆ సినిమా సమయంలో మహేష్, నమ్రత ప్రేమలో పడ్డారు.

మహేష నమ్రతల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని వార్తలు ప్రచారంలోకి వచ్చినా చివరకు మహేష్ నమ్రతల పెళ్లి జరిగింది.అయితే మహేష్ నమ్రతల ప్రేమకథ గురించి అభిమానులకు పెద్దగా తెలియదు.

Telugu Lovestory, Mahesh Babu, Namrata, Tollywood, Vamshi-Movie

అయితే ప్రముఖ మ్యాగజైన్ కొరకు మహేష్ నమ్రత కవర్ ఫోటో ఇవ్వడంతో పాటు ఇంటర్వ్యూ ఇచ్చి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.మహేష్ మాట్లాడుతూ తొలిసారి కలిసినప్పుడే ఒకరినొకరు ఎక్కువ టైమ్ చూసుకునే వాళ్లమని రెండేళ్ల తర్వాత ఆ ప్రేమ సీరియస్ గా మారడంతో పెళ్లికి సిద్ధమయ్యామని మహేష్ తెలిపారు.నమ్రత మాట్లాడుతూ తొలిసారి మహేష్ ను చూసిన సమయంలోనే తనకు ప్రత్యేక అనుభూతి కలిగిందని మహేష్ తో అలా ప్రేమలో పడ్డానని తెలిపారు.

Telugu Lovestory, Mahesh Babu, Namrata, Tollywood, Vamshi-Movie

మహేష్ బాబు చాలా ఇన్నోసెంట్ అని మహేష్ లాంటి వ్యక్తిని ఎక్కడా కనిపెట్టలేనని అనుకున్నానని నమ్రత వెల్లడించారు.15 సంవత్సరాలకు పైగా నమ్రత మహేష్ అన్యోన్యంగా ఉన్నారు.పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube