ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా నుండి రష్మిక మందన్న లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.
ఈమె పాత్రను పరిచయం చేస్తూ రష్మిక గ్లామర్ స్టిల్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.రష్మిక మాస్ లుక్ లో కనిపించ బోతుందని ముందు నుండే సమాచారం.
ఇక ఈ స్టిల్ విడుదల అయినా తర్వాత అంత అనుకున్న విధంగానే రష్మిక మాస్ పాత్రలో కనిపించబోతుంది.

ఇక రష్మిక ఈ లుక్ లో బాగుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ స్టిల్ విడుదల చేయడం మాత్రం నచ్చలేదని అభిమానులు అంటున్నారు.సుకుమార్ రష్మిక ఈ స్టిల్ కాకుండా మరేదైనా స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేసి ఉంటే బాగుండేది అని నెటిజెన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.ఆమె లుక్ అయితే బాగుంది కానీ చూపించిన విధానం సరిగా లేదని ఆ ఫోజ్ కాకుండా వేరేది ఏది అయినా బాగుండేది అని అంటున్నారు.

రంగస్థలం అప్పుడు సమంత లుక్ చూసి అందరు ఫిదా అయ్యారు.కానీ ఇప్పుడు మాత్రం రష్మిక ఆ ఫోజ్ లో ఉండడం చూసి ఎవరికీ వారు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఇలా రష్మిక లుక్ పై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో ఫుల్లీ మాస్ లుక్ అవవడంతో రష్మిక పుష్పరాజ్ పక్కన బాగా సెట్ అవుతుందని అనుకుంటున్నారు.