కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్త గా తీసుకొచ్చిన రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ చేపడుతూ ఉంది.ఈ క్రమంలో రైతు సంఘాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి.
ఏపీ అధికార పార్టీతో పాటు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి.ఒక రాజకీయ పార్టీలు మాత్రమేకాక రైతు మరియు ప్రజా కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు సర్వీసులను మధ్యాహ్నం వరకు నిలిపివేసినట్లు ఆర్టీసీ ప్రకటన చేయడం జరిగింది.అదేవిధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించాయి.
ఇదిలా ఉంటే జరుగుతున్న బంద్ కార్యక్రమానికి జనసేన అదేవిధంగా బిజెపి పార్టీలు దూరంగా ఉన్నాయి.రైతు చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం మరియు వాణిజ్య సంస్థలు కూడా మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసి వేయడం జరిగింది.
కుండపోత వర్షం కురుస్తున్న గాని రాష్ట్రంలో రైతు సంఘాలు కార్మిక నాయకులు వివిధ పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.తెలంగాణ లో కూడా రైతు సంఘాలు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ డిపోల నుండి బస్సులో రాకుండా అడ్డుకోవడం జరిగింది.
జాతీయ రహదారులపై కూడా నిరసన కార్యక్రమాలు తిరుగుతూ ఉన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో భారత్ బంద్ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది.