ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల‌ను చంప‌డం ఆపండి.. ప్ర‌పంచం కాపాడాల‌ని వేడుకుంటున్న ర‌షీద్‌ఖాన్‌..

ప్ర‌స‌త్తుం ఆఫ్ఘ‌నిస్తాన్ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఎందుకంటే ఇక్క‌డ జ‌రుగుతున్న దారుణాలు ప్రంప‌చాన్ని కుదిపేస్తున్నాయి.

 Stop Killing Afghan People Rashid Khan Begging To Save The World Rashid Khan, A-TeluguStop.com

ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కు కాస్త సైలెంట్ గానే ఉన్న‌ట్టు క‌నిపించిన తాలిబ‌న్లు నిన్న ఒక్క‌సారిగా రెచ్చిపోయారు.ఇక కాబూల్ లో నిన్న జరిగిన పేలుడుతో చాలామంది ఆఫ్గనిస్తాన్ ప్ర‌జ‌లు మ‌ర‌ణించారు.

ఇక ఈ ఘ‌ట‌న‌పై స్పిన్నర్ రషీద్ ఖాన్ చాలా ఆవేద‌న‌తో ట్వీట్ చేశారు.ఈ ఘ‌ట‌న త‌న‌ను క‌లచి వేసింద‌ని చెప్పుకొచ్చాడు.ఈ ఘ‌ట‌న‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించారు.

ఇక ఆఫ్గన్ ప్ర‌జ‌ల‌ను చంపడం ఆపండి అంటూ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరుతున్నాడు.

ఇప్ప‌టికే చాలా ర‌క్త‌పాతం అయింద‌ని ఇలాంటి క్ర‌మంలో ఇప్పుడు మ‌రోసారి కాబూల్ ఎయిర్ పోర్టు రక్తస్రావం అవుతోందంటే ఆవేద‌న చెందాడు.ఇంత దారుణ ప‌రిస్థితుల‌ను తాను ఊహించ‌లేద‌ని, ద‌య‌చేసి ఇలాంటి దారుణ ప‌రిస్థితుల్లో ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల‌ను వదలకండి అంటూ ప్ర‌పంచాన్ని వేడుకుంటున్న‌ట్టు రాసుకొచ్చాడు.

ఎలాగైనా ప్ర‌జ‌ల‌ను కాపాడాల‌ని వేడుకుంటున్నాడు.ఇక నిన్న జ‌రిగిన ఫాదాయీన్ దాడుల్లో దాదాపుగా 80 మంది ప్రాణాలు కోల్పోయారు.

Telugu Aafganisthan, Afghan, America, Kaabool Airport, Khorasan, Rashid Khan, Ta

కాబూల్‌లోని ఎయిర్ పోర్టు వ‌ద్ద జ‌నాల ర‌ద్దీని టార్గెట్ గా చేసుకుని గురువారం సాయంత్రం రెండు సార్లు ఆత్మాహుతి దాడులు జ‌రిపారు.అయితే ఈ దారుణ ఘ‌ట‌న‌ల్లో దాదాపుగా 200 మంది ప్ర‌జ‌లు గాయపడ్డారు.ఇక ఈ చ‌నిపోయిన వారి లిస్టులో 12 మంది యూఎస్ మెరైన్ కమాండర్లు ఉండ‌టంతో అమెరికా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.అయితే ఈ దాడుల‌కు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎకు చెందిన ఖోరాసన్ గ్రూప్ తెగబ‌డిన‌ట్టు పేర్కొంది.

తామే ఈ దాడుల‌ను ప్లాన్ చేశామ‌ని తెలిపింది.ఇక కాబూల్ లో మ‌రిన్ని దాడులు జ‌ర‌గ‌వ‌చ్చ‌నే సంకేతాల‌తో అక్క‌డి నుంచి ఫ్లైట్ స‌ర్వీసుల‌ను పూర్తిగా ఆపేసింది యూఎస్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube