నేరాలు జరిగిన అతి తక్కువ సమయంలోనే నేరస్తులను పట్టుకుని వారిని ఊచలు లెక్కపెట్టించడంలో అన్ని దేశాలలో అమెరికా ముందు ఉంటుంది.వారికి ఉన్న అత్యంత వేగవంతమైన టెక్నాలజీ తో ఎంతో క్లిష్టమైన కేసులలో నేరస్తులను పట్టుకుని రికార్డ్ లు క్రియేట్ చేసిన సంఘటనలు లెక్కకి మించి ఉన్నాయి.
అయితే ఓ భారతీయ యువతి హత్య ఘటన చేధించక ఇప్పటికి అమెరికా అవస్థలు పడుతూనే ఉంది, అవమాన పడుతూనే ఉంది.ఇది వ్యవస్థలో లోపమా, అధికారుల నిర్లక్ష్యమా, లేక ఎలాంటి ఒత్తిడులు ఉన్నాయా లాంటి సందేహాలు ప్రతీ ఒక్కరిని గడిచిన 14 ఏళ్ళుగా తొలుస్తూనే ఉన్నాయి.
అసలేం జరిగిందంటే 14 ఏళ్ళ క్రితం భారత దేశానికి చెందిన అర్పణా జినగా ఓ యువతి అమెరికాలో టెకీ గా ఉద్యోగం సంపాదించింది.తల్లి తండ్రులను విడిచి దూరంగా ఉండలేకపొయినా తన కలను సాకారం చేసుకోవానికి అమెరికా వెళ్ళింది.
ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె వాషింగ్టన్ లో అపార్ట్మెంట్ లో ఒంటరిగానే ఉంటోంది.అయితే ఒక రోజు తన అపార్ట్మెంట్ లో జరిగిన పార్టీలో పాల్గొన్న ఆమె మరుసరి రోజు తెల్లవారు జామున 2008 నవంబర్ -1 తేదీన హత్యకు గురయ్యింది.
అయితే అంతకు ముందు రాత్రి అర్పణా తల్లి తండ్రులు ఆమెకు ఎన్నో సార్లు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదని దాంతో మరుసరి రోజు తమకు తెలిసిన వారిని అర్పణ అపార్ట్మెంట్ కు వెళ్ళమని అడిగారు.ఈ క్రమంలో అర్పణ కోసం వెళ్ళిన ఫ్యామిలీ సిబ్బంది తెరిచి ఉన్న ఆమె రూమ్ లోకి వెళ్లి షాక్ అయ్యారు.
ఒంటిమీద బట్టలు లేకుండా దుర్వాసన వస్తున్నా ఆమె మృతదేహం వారికి కనపడటంతో ఆ సమాచారం తల్లితండ్రులకు అందించారు.ఆమె పై అత్యాచారం జరిగిందని తరువాత హత్య చేయబడిందని పోలీసులు నిర్ధారించారు.
అయితే ఆ నాటి నుంచీ నేటి వరకూ కూడా పోలీసులు హంతకులను పట్టుకోక పోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.ఈ విషయంలో అమెరికా తల దించుకోవాలని అగ్ర రాజ్యానికి ఈ ఘటన ఘోరమైన అవమానం తెచ్చిపెట్టిందని అంటున్నారు విమర్శకులు.
అయితే తాజాగా అక్కడి ఓ జర్నలిస్ట్ ఆమె హత్య ఘటనపై దృష్టి పెట్టి అసలు విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.