1.షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రారంభం

మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం గుండెంగ లో వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష ప్రారంభించారు.
2.నేటి నుంచి ఓపెన్ స్కూల్ దరఖాస్తులు
ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
3.గురుకుల కాలేజీలు తెరిచేందుకు ఏర్పాట్లు

గురుకుల సొసైటీ కాలేజీలు తెరిచేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమవుతున్నారు.కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దశలవారీగా విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీనిపై ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు.
4.కొత్తగా రెండు ప్రైవేటు వైద్య కళాశాలలు
తెలంగాణ లో కొత్తగా 10 వైద్యవిద్య కళాశాలలు అందుబాటులోకి రాబోతున్నాయి.వాటిలో ఎనిమిది కాలేజీలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి.
5.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 21,750 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
6.హైదరాబాద్ లో 50 త్రిపుల్ తలాక్ కేసులు

ట్రిపుల్ తలాక్ ను నిషేధించినా, హైదరాబాద్ నగరంలోని పోలీస్ స్టేషన్ లో ట్రిపుల్ తలాక్ కేసులు నమోదవుతున్నాయి.50 మంది ముస్లిం మహిళలు తమ భర్తలు తమకు ట్రిపుల్ తలాక్ ఇచ్చారంటూ పోలీసులను ఆశ్రయించారు.
7.రేపు హైదరాబాద్ కు మాణిక్యం ఠాగూర్

ఏఐసిసి ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ రేపు హైదరాబాద్కు రానున్నారు నాలుగు రోజుల పాటు ఆయన వివిధ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు.
8.క్యాబినెట్ చర్చ తర్వాతే సూళ్ల పై నిర్ణయం
మంత్రి వర్గం లో చర్చించిన తర్వాతే తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
9.జగన్ అక్రమాస్తుల కేసు

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేశారు.
10.మందడం లో 6 అడుగుల న్యాయ దేవత విగ్రహం
అమరావతి గ్రామం మందడం లో రైతులు ఆరడుగుల న్యాయ దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
11.శ్రీవారి సేవలో లోక్ సభ స్పీకర్

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
12.స్టీల్ ప్లాంట్ ఆందోళనలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు.
13.కోవిడ్ పరిస్థితి పై నేడు జగన్ సమీక్ష
ఏపీలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ ఈరోజు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
14.కర్నూలులో నారా లోకేష్ పర్యటన

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు కర్నూలు జిల్లా లో పర్యటించనున్నారు.ఏడాది క్రితం హత్యకు గురైన గోనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.
15.బొల్లినేని మెడి స్కిల్స్ లో కొత్త కోర్సులు
వైద్య రంగంలో మానవ వనరుల తయారీ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడే కోర్సులతో బొల్లినేని మెడి స్కిల్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆంధ్ర విద్యాలయ వైస్ ఛాన్స్లర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
16.ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల భర్తీపై స్టే ఎత్తివేత

విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా భర్తీ చేయడాన్ని నిలువరిస్తూ, 2010 డిసెంబరులో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం ఎత్తివేసింది.
17.ఆఫ్ఘన్ లో భారత రాయబారిని వెనక్కి పిలిచిన విదేశాంగశాఖ
ఆఫ్గాన్ లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున భారత విదేశాంగ శాఖ కాబూల్ లోని భారత రాయబారి సిబ్బందిని తక్షణం వెనక్కి రావాలని ఆదేశించింది.
18.ఆ ఏనుగులకు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి

కర్ణాటకలోని మైసూరు దసరా వేడుకల్లో పాల్గొని ఏనుగులకు తప్పనిసరిగా కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.
19.ఆఫ్గాన్ నుంచి గుజరాత్ చేరుకున్న ఐఏఎస్ విమానం
ఆఫ్గాన్ రాజధాని కాబూల్ నుంచి 120 మంది భారత అధికారులతో బయలుదేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ 17 విమానం గుజరాత్ లోని జూమ్ నగర్ చేరుకుంది.
20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,970 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -46,970