మంచినీరు మానవాళికి ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే నీరు తాగితేనే ఏ జీవి అయినా బతకగలుగుతుంది.
లేదంటే చాలా కష్టం.కానీ ఇప్పుడున్న కొన్ని పరిస్థితుల వల్ల చాలా దేశాల్లో అసలు మంచి నీరు అనేదే దొరకకుండా అయిపోతోంది.
కొన్ని దేశాల్లో అయితే పెట్రోల్ కంటే కూడా మంచినీరే చాలా అధిక రేటు కలిగి ఉంటోంది.దీంతో ఇప్పుడు పెద్ద పెద్ద అభివృద్ధి దేశాలు కూడా మంచినీరును సంపాదించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇక ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన సింగపూర్ దేశంలోని ప్రభుత్వం తన ప్రజలందరికీ మంచి నీరు అందించేందుకు ముదుకు వచ్చింది.ఈ క్రమంలోనే బృహుత్తర కార్యానికి రెడీ అయింది అక్కడి ప్రభుత్వం.
ఇక ప్రయత్నంలో భాగంగానే చాలా అడ్వాన్సెడ్ టెక్నాలజీతో కూడిన ఓ ప్లాంట్‌ను డెవలప్ చేస్తోందని తెలుస్తోంది.అయితే ఈ ప్లాంట్ ఏకంగా నగరాల్లోని మురుగునీటిని శుద్ధి చేసి మరీ తాగునీటిని తయారు చేస్తుందంట.
ఆ తాగునీటినే ప్రజలకు ఇప్పిస్తారంట.

ఎందుకంటే సింగపూర్‌లో మామూలుగానే సహజనీటి వనరులు చాలా తక్కువగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం ఈ ప్రయత్నం మొదలు పెట్టినట్టు తెలుస్తోది.ఇక ప్రతి ఏడాది కూడా నీటి ఎద్దడితో తాగు నీటి కోసం పొరుగున ఉన్న మలేషియా ఏదా ఇతర దేశాలపై ఆధారపడటం నచ్చక సొంతంగా నీరును తయారు చేసేందుకు గాను ఈ విధమైన ప్రయత్నం చేస్తోంది.భారీ పంపులతో పాటు టన్నెల్స్ లాంటి వాటితో చాలా బడ్జెత్ హైటెక్ ప్లాంట్ల నెట్‌వర్క్‌ను డెవలప్ చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం రెడీ అయింది.
ఈ విధమైన టెక్నాలజీ ద్వారా 2060వ మాసికంలో 55 పర్సెంట్ వరకు నీటి ఎద్దడిని అధిగమించ వచ్చని తెలుస్తోంది.
.