నీరజ్ చోప్రా. ఇండియాకు ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ తీసుకు వచ్చి దేశ ఖ్యాతిని అమాంతం పెంచేశాడు.
ఇక ఈ విన్నింగ్ తో ఆయన ఒక్క సారిగా దేశంలో హీరోగా మారిపోయాడు.ఇప్పుడు ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఆయన పేరే వినిపిస్తోంది.
అందరూ ఆయన్ను పొగుడుతూ పోస్టింగ్‌లు కూడా పెడుతున్నారు.ఇక ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఆయనకు ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ఇప్పుడు ఓ రెస్టారెంట్ వారు కేవలం నీరజ్ పేరు ఉంటే చాలంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
కాగా ఈ రెస్టారెంట్ కూడా మన ఆంధ్రాకు చెందిన చిల్లీస్ రెస్టారెంట్.
ఇక ఈ రెస్టారెంట్ ఓనర్ నీరజ్ పై తనకున్న అభిమానాన్ని కొంచెం డిఫరెంట్‌గా చూపించేందుకు ట్రై చేశాడు.ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి మన దేశానికి గొప్ప గౌరవం తెచ్చిన నీరజ్ చోప్రాకు విషెస్ తెలుపుతూ కేవలం నీరజ్ అనే ధీరుడి పేరు ఉంటే చాలని వారికి ఫ్రీగా బిర్యాని పెడతామంటూ ప్రకటించేశాడు.
నీరజ్ పేరున్న వారందరికకీ ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఆంధ్రాలోని తిరుపతి, కడప పట్టణాల్లోని చిల్లీస్ రెస్టారెంట్ లలో నీరజ్ పేరున్న వారికి చికెన్ మినీ ప్యాక్‌ను ఫ్రీగా అందిస్తామంటూ ప్రకటించేశాడు.
కాగా ఈ బిర్యాని కోసం వచ్చే వారంతా తమ వెంట తప్పకుండా తమ ఆధార్ జీరాక్స్ తీసుకురావాలని లేదంటే బిర్యానీ ఇవ్వడానికి వీలు కాదంటూ చెప్పేశాడుఉ.ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన పాంప్లేంట్ కాస్త నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.ఇక దీంతో పాటు గుజరాత్ లోని బరూచ్‌లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ ఓనర్ కూడా నీరజ్ పేరున్న వారందరికీ రూ.501 విలువైన పెట్రోల్ ను ఫ్రీగా పోస్తామంటూ చెప్పేశాడు.నీరజ్ పేరు ఎవరికి ఉన్నా కానీ వారా ఆధార్ కార్డు లేదా జిరాక్స్ తీసుకొస్తే పెట్రోల్ ఇస్తామంటూ ప్రకటించేశాడు.