వైరల్: భర్త చనిపోయిన తర్వాత ఆయన పై ప్రేమతో భార్య ఏకంగా..?!

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి దేవుడు ఒక తోడును ముందే వెతికి ఉంచుతాడు అనడానికి పెళ్లి ఒక ఉదాహరణ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఎవరో పరిచయం లేని వ్యక్తితో మూడు ముళ్ళు వేయించుకుని, ఏడు అడుగులు నడచి, పెళ్లి అనే బంధంతో ఇద్దరు ఒకటి అవుతారు.

 After The Death Of The Husband, The Wife Is United With Love For Him Wife, Husb-TeluguStop.com

పెళ్లి అయ్యాక ఇద్దరు శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా దగ్గర అయి కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటారు.భర్త ప్రతి కష్టంలోనూ భార్య చేదోడు వాదోడుగా ఉంటూ దైర్యం చెబుతుంది.

అలా భార్యభర్తల బంధం అనేది ఒక విడదీయలేని బలంగా మారుతుంది.మరి అలాంటి భార్యభర్తల బంధంలో అర్ధాంతరంగా భర్త తనువు చాలించి భార్యను ఒంటరి దాన్ని చేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతే ఆమే పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించుకోండి.

అలా తన భర్త జ్ఞాపకాలలోంచి బయట పడలేక ఒక భార్యామణి చేసిన పని గురించి తెలిస్తే మీరే షాక్ అవుతారు.పతియే ప్రత్యక్ష దైవం అని మన పెద్దలు అంటూ ఉంటారు కదా ఆ మాటనే నిజం చేసింది ఈ మహా ఇల్లాలు.

చనిపోయిన తన భర్తకి ఏకంగా విగ్రహం కట్టించి మరి పూజలు చేస్తుంది.మరి ఈ ఘటన ఎక్కడ జరిగింద ఏంటి అనే వివరాల్లోకి వెళితే.ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలంలో ఉన్న నిమ్మవరం అనే గ్రామంలో ఉన్న అంకిరెడ్డి, పద్మావతి ఇద్దరు భార్యభర్తలు ఉండే వాళ్ళు.అయితే నాలుగేళ్ల క్రితం అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో అంకిరెడ్డి తనువు చాలించాడు.

భర్త హఠాత్ మరణాన్ని మరిచిపోలేని పద్మావతి భర్తనే తలుచుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.

Telugu Andhra Pradesh, Statue, Latest-Latest News - Telugu

భర్త జ్ఞాపకాల నుంచి బయట పడలేక భర్తను దైవంగా బావించి అతనికి ఏకంగా ఒక గుడికట్టించింది.ఆ గుడిలో భర్త రూపాన్ని ఏ మాత్రం చెక్కు చెదరనివ్వకుండా ఒక పాలరాతి విగ్రహాన్ని కూడా తయారు చేయించి గుడిలో ప్రతిష్టించింది.ఆ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తూ దైవం మాదిరిగా కొలుస్తోంది.

అలాగే ఎంతో మంది సమాజసేవకులను సన్మానాలు కూడా చేసింది.ఇలా తన భర్త స్నేహితుడు అయిన తిరుపతిరెడ్డి, కుమారుడు శివశంకర్ రెడ్డితో అందరికి సేవలు చేస్తోంది.

అలాగే ప్రతి పౌర్ణమి రోజున, శని, ఆదివారాలలో ఎంతో మంది నిరుపేదలకు తన భర్త పేరు మీద అన్నదానం చేస్తూ వాళ్ళ ఆకలిని తీరుస్తుంది ఈ మహాతల్లి.భర్త చనిపోయి నాలుగేళ్లు అవుతున్న అతనిని మర్చిపోకుండా తన భర్త మీద తనకు ఉన్న ప్రేమను ఇలా గుర్తు చేసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube