భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే బ్రహ్మంగారు చెప్పారు.వాటన్నింటిని తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు.
ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు.ఇప్పుడు సమాజంలో అనేక వింతలు, విశేషాలు జరుగుతున్నాయి.
ఎప్పుడూ ఎక్కడో ఓ చోట ఏదో రకంగా వింత ఘటన అనేది వార్తల్లో నిలుస్తూ ఉంది.తాజాగా అలాంటి వింత ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఒక ఆవు పంది పిల్లలకు పాలు ఇచ్చింది.ఆవు దగ్గరికి వచ్చి పంది పిల్లలు పాలు తాగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ ఘటన చాలా వింతగా ఉంది.దీనిని చూసిన స్థానికులు, ప్రయాణికులు అవాక్కయ్యారు.ఆశ్చర్యంతో షాక్ అయ్యారు.ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పట్టణ బస్టాండ్ ప్రాంతంలో ఎప్పుడూ ఆవులు తిరుగుతూ ఉంటాయి.
ఆ ఆవులు రాత్రి పూట ఆ బస్టాండు ఆవరణలోనే ఉంటాయి.ఆకులు, పేపర్లు తింటూ జీవనం సాగిస్తుంటాయి.
అయితే అక్కడే ఖాళీ ప్రదేశంలో అవి సేదతీరుతూ ఉంటాయి.
బస్టాండుకు సమీపంలో ఆవులతో పాటు పందులు కూడా తిరుగుతుంటాయి.
అలా ఒకేసారి ఆవులు, పందులు కలిసి సేదతీరుతుంటాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఆవు నిద్రపోతుండగా పంది పిల్లలు ఆ ఆవు దగ్గరికి వచ్చాయి.
ఆ టైంలో ఆవులను చూసి ఆ పంది పిల్లలు విచిత్రంగా ప్రవర్తించాయి.పడుకుని సేద తీరున్నట్టువంటి ఆవు పొదుగు దగ్గరికి వెళ్లి పంది పిల్లలు చేరడమే కాదు ఎంచెక్కా ఆవు పాలను తాగాయి.
ఈ విషయాన్ని స్థానికులు గమనించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.వెంటనే వారు పంది పిల్లలు పాలు తాగుతున్న విషయాన్ని వీడియోలు తీశారు.
ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.చూసిన వారంతా బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతోందని ఆశ్చర్యపోయారు.