ప్రస్తుత పరిస్థితుల్లో నెట్టింట ఎప్పుడు ఏది ట్రెండవుతుందనేది చెప్పడం సోషల్ మీడియా నిపుణులకూ కష్టమైన విషయమే.ఆసక్తికరమైన విషయమైతే చాలు.
ప్రపంచం నలుమూలాల్లో ఎక్కడి నుంచి ఏది అయినా ట్రెండ్ ప్లస్ వైరల్ కావొచ్చు.ఇక సెలబ్రిటీలు అట్లాంటి పోస్టులు చేస్తే క్షణాల్లోనే ట్రెండవుతాయి.
డిజిటల్ ఎరా కొనసాగుతున్న క్రమంలో చిన్న విషయమైనా దానికి కేన్వాస్ లభిస్తోంది.అభిమానులు, నెటిజనాలు సెలబ్రిటీల పోస్టులను కామెంట్లు, లైకులు, షేరింగ్స్‌తో వైరల్ చేస్తున్నారు.
తాజాగా ఓ సెలబ్రిటీ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండవుతోంది.దానికి రెండు కోట్ల మంది లైక్స్ చేశారు.
ఇంతకీ అందులో ఏముంది తెలుసా.
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు లియోనెల్ మెస్సీ.ఫొటోలో లియోనెల్ మెస్సీ ట్రోఫీతో దిగిన ఫొటోను చూసి మెస్సీ అభిమానులు తెగ లైకులు కొట్టారు.ఫొటోకు రెండు కోట్ల లైకులు రాగా, కామెంట్స్ కూడా బోలెడు వచ్చాయి.గతంలో డీగో మారడోనా మరణించినపుడు ఆయనకు నివాళిగా రొనాల్డో ఫొటో పోస్ట్ చేయగా, దానికి కేవల 1.98 కోట్ల లైకులు మాత్రమే వచ్చాయి.
కాగా, దీనికి మంచిని షేరింగ్స్ అండ్ లైక్స్ లియోనెల్ మెస్సీ ఇన్ స్ట్ ఫొటోకు వచ్చాయి.రీసెంట్‌గా కోపా అమెరికా ఫైనల్స్‌లో బ్రెజిల్‌పై లియోనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా టీం విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా, మెస్సీ తన కెరీర్‌లోనే తొలిసారిగా అంతర్జాతీయ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.
ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేశాడు లియోనెల్ మెస్సీ.అర్జెంటీనా టీం గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు లియోనెల్ మెస్సీ.