సామాన్యులు సంతోషంగా బ్రతికే రోజులను కరోనా తన కాటుతో ఛిద్రం చేసింది.ఇక ముందు ముందు మంచి రోజులు వస్తాయనే ఆశను కూడా రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చిదిమేస్తున్నాయి.
అతికష్టం మీద బ్రతుకు జట్కా బండిని లాగుతున్న సామాన్యుని నెత్తి మీద ఊహించని విధంగా ధరల పిడుగులు పడుతున్నాయి.
ఇప్పటికే మండిపోతున్న నిత్యావసరాల రేట్లతో పాటుగా, చమురు ధరలు కూడా చెమటలు పట్టిస్తున్నాయి.
ఇక కనీసం రెండుపూటలా తిండి దొరక్కున్నా ఇన్ని పాలు తాగి కడుపునింపుకునే వారు కూడా ఉన్నారు.కానీ వీటి ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.ఇకపోతే రేపటి నుండి ప్రజల పై మరో భారాన్ని వేస్తూ గుజరాత్ బేస్డ్ ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో లీటర్ పాలపై రెండు రూపాయలు పెంచుతున్నట్లు పేర్కొంది.

కాగా పెరిగిన ఈ ధరలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అమూల్ బ్రాంచ్‌లలో అమలు చేయనున్నట్లుగా ఈ సంస్ద అధికారులు వెల్లడిస్తున్నారు.ఇక ప్రస్తుతం పెరుగుతున్న ధరలు తమకు భారంగా మారాయని ఈ నేపధ్యంలో పాల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి తెలియచేస్తున్నారు.