అద్భుతమైన రుచి కలిగి ఉండే మజ్జిగ, ఘాటైన వాసన.రుచి కలిగి ఉండే వెల్లుల్లి.
ఈ రెండూ విడి విడిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే.ఎందుకంటే, ఇటు మజ్జిగ.
ఇటు వెల్లుల్లి రెండింటిలోనూ అపారమైన పోషకాలు నిండి ఉన్నాయి.అందుకే చాలా మంది వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటారు.
అయితే విడి విడిగానే కాదు.కలిపి తీసుకున్నా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి మజ్జిగ, వెల్లుల్లి కలిపి ఉలా తీసుకోవాలి? అలా తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటీ? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్ ను ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి సేవించాలి.రుచి కోసం చిటికెడు ఉప్పు కలిపి కూడా తీసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.దాంతో జబ్బుల బారిన పడకుండా ఉంటాయి.
శ్వాస సమస్యలు కూడా దూరం అవుతాయి.
అలాగే మజ్జిగలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే.
కడుపులో మంట, నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, అల్సర్, మలబద్ధకం, డయేరియా వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.అదే సమయంలో జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగు పడుతుంది.
సాధారణంగా చాలా మంది గురక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు.అలాంటి వారు.
నిద్రించడానికి గంట, రెండు గంటల ముందు మజ్జిగలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే గురక రాకుండా ఉంటుంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్ది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.అయితే మజ్జిగలో వెల్లుల్లి కలిపి ప్రతి రోజు తీసుకుంటే.
బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అంతేకాదు, రెగ్యులర్గా వెల్లుల్లి కలిపిన మజ్జగ తీసుకుంటే.తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు పరార్ అవుతాయి.
రక్త పోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది.