ఆత్మవిశ్వాసానికి చర్మసౌందర్యం చాలా ముఖ్యం.మన కనబడే తీరు కూడా మన మీద ఒక అభిప్రాయం ఏర్పడటానికి కారణవుతుంది.
పుట్టుకతోనే అందరికి చర్మ సమస్యలు ఉండవు.జన్యుపరమైన కొన్ని సమస్యలు పక్కనపెడితే, చర్మం యొక్క ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని దెబ్బతీసే మిగితా సమస్యలన్ని మన అలవాట్ల వలన వచ్చేవి.
ఆ అలవాట్లు ఏంటో తెలుసా?
* ముఖం మీద ఆంటిబ్యాక్టిరియల్ ప్రాడక్ట్స్ వాడటం చర్మం యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.మనం వాడే సబ్బులు, క్రీమ్ లు, సున్నితమైన స్కిన్ సెల్స్ ని డ్యామేజ్ చేయడమే కాకుండా, చర్మంలో ఉండే సహజమైన అయిల్స్ ని ఇబ్బందిపెడతాయి.
కాబట్టి సహజమైన యాంటి బ్యాక్టీరియా వనరులని వాడుకోవడమే ఉత్తమం.
* బాగా వేడిగా ఉండే నీళ్ళతో రోజూ స్నానం చేసినా ఇబ్బందే.
వేడిగా ఉండే నీళ్ళు మీ చర్మంపై పడగానే సెన్సిటివ్ స్కిన్ సెల్స్ ఎన్నో డ్యామేజ్ అవుతాయి.దాంతో రానురాను సహజసిద్ధమైన నిగారింపు మీ చర్మం కోల్పోతూ ఉంటుంది.
* చేతులను ముఖంపై పెట్టడం కూడా మంచి అలవాటు కాదు.కంటికి కనబడని బ్యాక్టీరియా ఎప్పుడూ మీ చేతులకు అంటుకుంటూనే ఉంటుంది.ఆ బ్యాక్టీరియా మొత్తం మీ ముఖంపై రుద్దేస్తే ఎలా?
* మొటిమలు వచ్చినప్పుడు గిల్లితే, అది ఒక మరకతో పాటు, కంటికి కనబడే రంధ్రం వదిలి వెళ్ళుతుంది.మొటిమలు గిల్లకుండా వదిలించుకోవడానికి ఎన్నోరకల మార్గాలు ప్రకృతే మనకు అందించింది.
వాటిని ఆశ్రయించడమే సబబు.
* సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారి చర్మం త్వరగా పాడైపోతుంది.
బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సైతం ఈ విషయాన్ని అంగీకరించి, తనకున్న స్మోకింగ్ అలవాటు వలనే తన వయసులోనే ఉన్న ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ల లాగా యవ్వనంగా కనిపించలేకపోతున్నాని చెప్పుకొచ్చాడు కింగ్ ఖాన్.
* ఎక్కువగా ఆయిలీ ఫుడ్ తింటే కూడా మెటిమల ఇబ్బంది పెరిగి, ముఖ సౌందర్యం కోల్పోతాము.
* నీరు తక్కువగా తాగే అలవాటు ఉంటే, త్వరగానే వయసు పెరిగినట్లు కనిపించడం ఖాయం.
* నిద్రలేమి సమస్య కూడా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
కాబట్టి కంటికి, ఒంటికి అవసరమైన 7-8 గంటల నిద్ర ప్రతీరోజు మనకు అందాలి.