జగన్ పైనే వారి భారం ... వీరిపై గరం గరం 

కొన్ని కొన్ని అవాంతరాలు ఎదురైనా అంతిమంగా జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది.జగన్ నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాల పై ప్రజలలోను సంతృప్తి ఉంది.

 Ap Cm Jagan Angry On Ycp Mlas Behavior, Jagan, Ap Cm, Ysrcp, Ap, Tdp, Ysrcp Mla-TeluguStop.com

ఇక పల్లె నుంచి పట్నం వరకు జనాలకు ఇబ్బంది లేకుండా వాలంటీర్ల ద్వారా జగన్ చక్కబెడుతున్నారు.ఇక ఎమ్మెల్యేలు సంతోషంగానే ఉన్నారు.

ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుండడం,  నియోజకవర్గాల్లో ప్రజలకు సంతప్తి కనిపిస్తుండడంతో,  మళ్లీ తమకు వచ్చే ఎన్నికల్లో తిరుగు ఉండదనే లెక్కలు వైసీపీ ఎమ్మెల్యే లు  వేసుకుంటున్నారు.అయితే చాలా మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడం,  జనాల్లో తిరగకపోవడం, అన్నిటికీ జగన్ పైన భారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విషయం జగన్ వరకు వెళ్ళింది.

జగన్ తన రెండేళ్ల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తో పాటు, ప్రజలకు భారీగానే సొమ్ములు  అందించారు.ఆ ఎఫెక్ట్ ఏపీ లో జరిగే ప్రతి ఎన్నికలలోనూ కనిపిస్తోంది.

స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు, ఇలా ఎందులో అయినా వైసీపీకి బంపర్ మెజారిటీ దక్కుతోంది.అయితే ఈ వ్యవహారాలన్నీ వైసీపీ ఎమ్మెల్యే లకు బాగా కలిసి వస్తుండడంతో వారు పూర్తిగా జగన్ పైనే భారం అన్నట్టు గా వ్యవహరిస్తుండడం తో అటువంటి ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయానికి జగన్ వచ్చారట.

కేవలం తన ఇమేజ్ మీద కాకుండా, ఎమ్మెల్యేలు సొంతంగా పనితీరు మెరుగు పరుచుకుని, ప్రజల్లో మమేకమై, వారి సమస్యలను తీరుస్తూ , పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడేలా వ్యవహరించకపోతే ప్రయోజనం ఏముంది అనేది జగన్ అభిప్రాయమట.

Telugu Ap Cm, Ap, Jagan, Welfare Schemes, Ycp Mlas, Ysrcp, Ysrcp Mlas-Telugu Pol

  ఒకవైపు వైసీపీ ప్రభుత్వానికి ఆదరణ వస్తున్నా, క్రమక్రమంగా టిడిపి బలం పుంజుకుంటోంది.చాలా నియోజకవర్గాల్లో టిడిపి గతంతో పోలిస్తే బలపడిందని నిఘా వర్గాలు రిపోర్ట్ లతో జగన్ మరింత అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.అందుకే ఇప్పటి నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని వారికి ఇన్చార్జి మంత్రుల ద్వారా వార్నింగ్ ఇవ్వడం,  మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదనే సంకేతాలను ఇచ్చే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారట.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube